- కనక ప్రసాద్
రాగం: మాయామాళవ గౌళ ఏక తాళంపల్లవి
అపరాధములఁ గాచు తల్లిఅపరాజితా నత కల్పవల్లి
అనుపల్లవి
చపలమని చెప్పుకున్నానుకపటినని నీ ముందు ఒప్పుకున్నాను
అపరంజి అకలంక మేధి
అపురూపమని అక్కడే ఇమ్ముకున్నాను |అపరాధములఁ గాచు|
చరణం
ఎవి ఏవియని తలంచుదును?కవగూడి తనువాశ లెటులు వంచుదును?
చివరంటు సున్నలో అమ్మ! నీవు
అవలోకమై అట్టె నించుదును. |అపరాధములఁ గాచు|
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
Meaning
O Mother, who forgives our sins -
A celestial wish-fulfilling tree to those who surrender to you,
The invincible Mother.
I confessed in front of You
That this mind is fickle, and I an imposter,
And made the flawless, invaluable hitch of Your feet
As my one and only sanctuary. |O Mother|
How am I to sort out this perplexing world,
Caged in this body, how am I to fight its cravings?
In the ultimate Void beyond, as you appear
I stand captive, motionless without words. |O Mother|