అర్థరాత్రి ఎందుకో మెలకువ వచ్చి దుప్పటి ముసుగు తీసి చూస్తే, నా గదిలో, నా రాత బల్ల ముందు కూర్చుని, టేబిల్ లాంప్ వెలుగులో ఎవరో అపరిచితుడు పుస్తకం చదువుకుంటున్నాడు. తలుపు గడియ వేసి ఉంది. గోడ మీద గడియారం ఒంటి గంట చూపిస్తుంది. ఈ అసంబద్ద దృశ్యానికి నన్ను నేను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. నా రోగిష్టి మంచపు కీళ్ళను ఏ మాత్రం మూల్గనీయకుండా, ఒద్దికగా అతని వైపు ఒత్తిగిలి, శ్రద్దగా పరిశీలించాను. బూడిదరంగు పొడుగు చేతుల చొక్కాను నీలంరంగు జీన్స్ లోకి టక్ చేసుకున్నాడు. ఒక చేయి దవడకు ఊతంగా ఆన్చుకుని, మరో చేత్తో మేజాపై పుస్తకాన్ని అదిమిపెట్టి, చాలా దీక్షగా చదువుకుంటున్నాడు. టేబిల్ లాంప్ అతని ముఖ పార్శ్వపు అంచుల్ని దివ్యంగా వెలిగిస్తుంది. ఎంతసేపటి నుండి చదువుకుంటున్నాడో — సెకనుముల్లు మరో రెండు ఆవృతాలు పూర్తి చేసాక, ఉన్నట్టుండి పుస్తకం మూసి పైకి లేచాడు. తీక్షణమైన ఏకాగ్రత వల్ల కలిగిన బడలికను తీర్చుకోవడాని కన్నట్టు, వళ్ళంతా విల్లులా వెనక్కి విరుచుకుని, “హాఆఆఆయ్!” అంటూ దీర్ఘంగా ఆవలించాడు. పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, వెనక్కి తిరిగి, అల్మారా వైపు నడిచాడు. ఈ ప్రయత్నంలో తన కాళ్ళ దగ్గిర ఉన్న ప్రయాణపు లగేజీ నొకదానిని తన్నుకుని ముందుకు తూలి పడబోయాడు. నిలదొక్కు కున్నాడు. అల్మారా చేరుకుని పుస్తకాన్ని వరుసలో సర్ది పెట్టేసాడు. ఇపుడా గూట్లోంచి ఒక్కో పుస్తకాన్నీ తీసి, టేబిల్ లాంప్ వెలుగులోకి వంచి చూసి, మరలా యధాస్థానం లో పెడుతున్నాడు. అతని వీపు భాగం నా వైపుకు ఉంది. ఇదే అదనుగా నేను నిశ్శబ్దంగా దుప్పటి వెనక్కు తొలగించి, మెల్లిగా, మంచపు అంచుపై లేచి కూర్చున్నాను. చేతికి అందుబాటులో ఆయుధ మేదైనా ఉన్నదా అని చుట్టూ పరికించాను. మంచం ప్రక్కన సన్నగా, పొడవుగా ముక్కాలి పీట ఉంది. దాని పైన ఉన్న అలారాన్ని జాగ్రత్తగా మంచం మీద పెట్టి, కొద్దిగా ముందుకు వంగుతూ పీట అడుగు భాగాన్ని అందుకుని, శబ్దం రాకుండా పైకి లేపడానికి ప్రయత్నిస్తుంటే, అతని స్వరం వినపడింది: “మీ దగ్గిర చాలా మంచి కలెక్షన్ ఉంది.” తుళ్ళిపడి అతని వైపు చూసాను. తల నా వైపే తిప్పి, నా భంగిమలో ఏ అసహజతా గమనించనట్టు, అభావంగా “ద మాన్ హూ వజె థర్స్‌డే” పేజీలు తిరగేస్తున్నాడు. నేనిక (ఈ భంగిమలో) దొరికిపోయిన దొంగ కావడం ఇష్టం లేక, అదే ఊపుతో పీట చేతిలోకి తీసుకు నిలబడి, “ఎవర్నువ్వు?” అరిచాను. నా ఈ చర్యకు ప్రతిగా అతని మొహంలో కమ్ముకొచ్చిన విభ్రమ నన్ను మరింత అయోమయంలో పడేసింది. నిశ్చేష్ఠుడై నా వంక, నా చేతిలో ముక్కాలి పీట వంకా మార్చి మార్చి పరకాయిస్తున్న అతన్ని చూస్తే, నిజంగా ఇతను నాకు పరిచయస్తుడేనా, పడుకునే ముందు వరకూ నాతో ఈ గదిలోనే ఉన్నాడా, ఇప్పుడు నేనే విచిత్రంగా ప్రవర్తిస్తున్నానా అన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం నా తర్వాతి ప్రశ్నలో కరుకుదనం పాలు కాస్త తగ్గించింది: “ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు?”
అతని నిశ్చేష్టత ఇపుడు బలవంతపు నవ్వులోకి మారింది. నేనేదో పరాచిక మాడుతున్నట్టూ, ఇది అతన్ని నవ్వించక పోయినా (హడలగొట్టినా), ఏదో నా మర్యాద కోసం మొహానికి పులుముకున్నట్టూ ఉంది ఆ నవ్వు. ఎలాగో గొంతు పెగుల్చుకుని, నేను స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నానా అన్న తన అనుమానం తీర్చుకోవడాని కన్నట్లు, “ఫణీ?!” అని పిలిచాడు. నాలో క్షణ క్షణానికీ అసహనం పెరిగిపోతుంది. అతనిది నటనో, నిజ వర్తనో అర్థం కావడం లేదు. స్టూలు అలాగే చేతిలో బిగించి పట్టుకుని, రెండడుగులు ముదుకేసి, “అవును ఫణినే... ఎవరు కావాలి?” అన్నాను బెదిరిస్తున్నట్టు. నిజానికి అతని దిట్టం చూస్తే, గట్టిగా పూనుకుంటే, నన్ను నిముషంలో నేల కంటుకు పోయేలా చేయగలడనిపిస్తుంది. కానీ అతనిలో ఏదో తగ్గుబాటు ధోరణి నన్ను తెగించేలా చేసింది. పై పెచ్చు అతని వాలకం కూడా నాలో కాస్త చులకన భావాన్ని పెంచింది. మనిషిలో ఆరడుగుల పొడవూ, నలభైయేళ్ళ వయస్సూ కనిపిస్తున్నా, మొహంలో మాత్రం ఏదో పసిదనం ఉంది. అతని చికిలింపు కళ్ళు — పెదాలతో ప్రమేయం లేకుండా — మొహానికి ఓ నిత్య దరహాస ధోరణిని ఆపాదిస్తున్నాయి. మూతి పైన పలుచగా, చివుర్లలో ఏపుగా వేలాడి ఉండే పిల్లి మీసాలు ముఖానికి మంగోలియన్ పోలికల్ని తెచ్చి పెట్టాయి.
ప్రస్తుతం పుస్తకాన్ని జాగ్రత్తగా అలమారలో పెట్టి, నన్ను సముదాయించడాని కన్నట్లు ఒక చేయి నా భుజం వైపుగా గాల్లో చాచి, ముందుకో అడుగు వేసాడు. నేను అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసాను. అతను ఆగి, చేతుల్ని నిస్సహాయసూచకంగా గాల్లో చూపిస్తూ, “కూల్ ఫణీ... ఇందాకేగా మనం కలిసింది; అప్పుడే ఎలా మర్చిపోతావ్,” అంటూ ప్రశాంతంగా, సహనంతో అడిగాడు.
ఆ నిబ్బరం నాకు నషాళాని కంటేలా చేస్తుంది, “హె హ్హె! ఎందాకేగా మనం ఎక్కడ కలిసాం?” ఉడుకుమోత్తనాన్ని అణుచుకుని వెక్కిరింపుగా అడిగాను.
“ఇప్పుడే... క్షణం క్రితం వరకూ... ఇద్దరం రైల్లో మాట్లాడుకుంటూ...” గుర్తు చేసుకోమన్నట్లు ఆర్థోక్తిలో ఆపి, ప్రోత్సాహకంగా చూసాడు.
హఠాత్తుగా, నిజంగానే నా మెదడు పొరల్లో ఏదో కదలిక — నిశ్చల తటాకపు అడుగున చేప పిల్ల మెదిలినట్టు.
అతడు కొనసాగించాడు: “నేను రైలు నిడదవోల్లో ఆగాక కాస్త చెప్పమన్నాను —”
“— నేనక్కడే దిగాలీ చెప్తానన్నాను,” అంటూ అప్రయత్నంగా నేనందుకున్నాను.
ఈ ఊతానికి అతడి ముఖం వెలిగిపోయింది. ఉత్సాహంగా స్వరం పెంచుతూ, “తర్వాత ఇద్దరం కబుర్లలో పడ్డాం —” అని నన్నందుకో మన్నట్టూ ఆగాడు.
ఇప్పుడిక యవనిక తొలగి యధార్థం భళ్ళున బయట పడింది. సర్వేంద్రియాలూ సత్తువుడిగి పోగా, దీనంగా, బలహీనంగా, “అది కల!” అన్నాను మంచం పై కూలబడిపోతూ.
అతడిక తన చింతలన్నీ తొలగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చి, “హమ్మయ్య! కంగారు పెట్టేవ్ కదయ్యా,” అంటూ మేజా క్రింద కుర్చీని నా వైపు త్రిప్పి కూర్చున్నాడు.
నేనతని వైపోసారి చూసి తల పట్టుకు కూర్చున్నాను.
“వాట్స్ ద మేటర్ విత్ యూ?” అనునయంగా అడిగాడు.
ఎందుకో ఈ మానవాతీత పరిస్థితిని నా ప్రస్తుత విభ్రమతో సమీక్షించ బూనడం నా మానసి కారోగ్యానికి అంత మంచిది కాదనిపించింది. స్థిమితం తెచ్చిపెట్టుకొని, మేకపోతు గాంభీర్యంతో ఇలా అన్నాను: “సీ... వుయ్ హేవె సిచువేషన్ హియర్; నీ కర్థం కావట్లేదు. కాస్త నిదానపడు; ఊహుఁ దొర్లుకుంటూ పోకు అర్థమైందా.” — ఇది నన్ను నేను ఉద్దేశించి చెప్పుకున్నది బహుశా. అయినా అర్థమైందన్నట్టు తల పంకించి, పరిస్థితి గాఢత అవగతమైనవాడిలా కుర్చీలో నిటారుగా సర్దుకుని కూర్చున్నాడు.
“ఊఁ! చెప్పిపుడు — నిదానంగా — చెప్పు,” అన్నాను ‘నిదానాన్ని’ సాధ్యమైనంత నిదానంగా సాగతీసి.
అతను ఉత్సాహంగా మొదలు పెట్టాడు, “వై ఫణీ...! రాత్రి ప్రయాణం. నీదీ నాదీ ఎదురు బొదురు బెర్తులు. నిడదవోలు ఎప్పుడొస్తుందని నేనడిగితే, అక్కడే దిగాలీ వచ్చినపుడు చెప్తానన్నావ్. నెమ్మదిగా మాటల్లో పడ్డాం. ఫలానా అంటే ఫలానా అనుకున్నాం. ఇంతలో — ”
అతన్ని కత్తిరించి మధ్యలో జొరబడి పోయాను, “ — ఇంతలో ఆ కలలోంచి నా కిక్కడ మెలకువ వచ్చింది. నా కిక్కడ మెలకువ వచ్చింది కాబట్టి నే నక్కడ లేను. నే నక్కడ లేను కాబట్టి నువ్విక్కడ కొచ్చేసావ్ — అంతేనా?” అతడేదో చెప్పబోయాడు. మళ్ళీ అడ్డేసాను; “వద్దు — అదే చెప్పేది — దొర్లుకు పోవద్దని! పరిస్థితి నిదానంగా సమీక్షిద్దాం: నిన్ను నా కలలో రైలు ప్రయాణంలో — లేదా నా రైలు ప్రయాణపు కలలో — తప్ప మెలకువలో ఇంతకు ముందెన్నడూ చూసిన, కలిసిన స్మృతి లేదు. ఇపుడసలు నీకు నిజంగా ఓ సొంత అస్తిత్వమంటూ ఏడిచిందా; లేక, నువ్వు కేవలం నా అల్లిబిల్లి కల అల్లిన కల్లబొల్లి మనిషివేనా అన్నది ప్రస్తుతానికో వివాదాస్పద అంశం. కాబట్టి రెండు రకాలుగానూ ఆలోచించి చూద్దాం: ఒకవేళ నీకంటూ ఒక నిజ-అస్తిత్వం ఉండి ఉంటే, బహుశా ఈ సమయానికి ఎక్కడో నిక్షేపంగా నిద్రపోతూండి ఉంటావు. ఇది కోటానుకోట్ల మెదళ్ళు మూకుమ్మడిగా కలలు కనే నిశా సమయం. కాబట్టి, ఏమో ఎవరు చెప్పొచ్చారు, యాదృచ్చికంగా ఒకరి కల మరొకరి కలని ఒరుసుకోవడం, చిక్కుపడటం... ఇలాటివేఁవన్నా సాధ్యమైతే! అలా నీ కలా నా కలా తగులుకొని నువ్వూ నేనూ ఒకే కల్లో, ఒకే రైల్లోకి వచ్చి పడి ఉండొచ్చు. నీ తప్పు లేదు. కాని అక్కడితో ఆగక, నిడదవో లెపుడొస్తుందో చెప్పకుండా నేను కల నుండి నిష్కృమించి నంతమాత్రాన, నువ్వూ నా వెనకే ఇలా నా వాస్తవిక వ్యక్తిగత జీవితంలోకి చొరబడి గలాభా చేయడం అమర్యాదకరం, కుసంస్కారం. అలాకాక, రెండో రకంగా, ఒక వేళ నీకంటూ అసలో స్వతంత్ర అస్తిత్వమే లేక, నువ్వు కేవలం నా సుషుప్తి పోత పోసిన భ్రమవే అయితే — ఇపుడే చెప్పేస్తున్నాను — నీకు నేనే మాత్రం బాధ్యత వహించ బోవటం లేదు,” అంటూ ఆయాస పడుతూ ఆగాను.
ఈ చివరి మాట చెవిన పడగానే, అతను కుర్చీని వెనక్కి నెట్టి, ధ్వజస్తంభంలా ఇంతెత్తున పైకి లేచాడు. ఉన్నట్టుండి అతని గోధుమ రంగు ముఖం రక్త సంచలనంతో జేవురించింది; కణతపై పచ్చగా ఒక నరం పైకి ఉబ్బింది. ఆవేశంతో ఊగిపోతూ ఇలా అందుకున్నాడు: “హౌ కెన్యూ సే దట్! నీకు బాధ్యత లేదా! నీ కలలకి నువ్వు జవాబుదారీ కాదా! నీకు నచ్చినట్టు విచ్చలవిడిగా కలలు కనేసి, ఇలా తమ ఆద్యంతా లెరుగని మిధ్యా అస్తిత్వాలకు జీవం పోసి, తర్వాత పూచీ లేదని మిన్నకుంటే, వాటి మానాన వాటిని వదిలేస్తానంటే — ఏం తమాషానా?” — ఈ చివరి మాట పలికేప్పుడు దున్న కుమ్మడానికి తల తాటించినట్టు తల ముందుకి తాటించాడు.
వ్యవహారం చేయి దాటుతున్నట్టు అనిపించడంతో కాస్త తగ్గాను: “అరె! మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తావేంటి? కూర్చో కూర్చో!” అనునయంగా అన్నాను. కూర్చున్నాడు; “నే చెప్పేదింకా పూర్తి కానే లేదు. నేను నీకు బాధ్యత వహించనని చెప్పింది బాధ్యత వహించలేక కాదు; సాధ్యం కాదు కనుక. ఇది కల కాదు. ఇక్కడ నువ్వు కుదురుకోలేవు. ఇక్కడ కొన్ని సూత్రాలుంటాయి. బంధనాలూ, పరిమితులూ ఉంటాయి — తెంచుకోలేనివి. ఉదాహరణకి కాలం; నువ్విక్కడ కలలోలా కాలపు చెరసాలను ఛేదించలేవు: ఆనందంలో ఉన్నా, విషాదంలో ఉన్నా, సమక్షంలో ఉన్నా, నిరీక్షణలో ఉన్నా గంటకు అరవై నిముషాలూ గడిపి తీరాల్సిందే. ఇక్కడ దూరమూ నీకు శత్రువే: ఆమెను చేరుకోవాలంటే నాల్గొందల కిలోమీటర్లూ రైల్లో ప్రయాణించాల్సిందే; అనుకోగానే వళ్ళో వాలలేవు. ఇక్కడ నువ్వు భూమికీ బానిసవే: గాల్లోకి ఎగిరితే తిరిగి భూమ్మీదే వాలాలి; మేఘాల్లోకి పోలేవు. ఇక్కడ హేతువు బాధా తప్పదు: ఆఫీసు కెళ్ళే బస్సెక్కితే చచ్చినట్టు ఆఫీసుకే చేరాలి; అంటార్కిటికా పోలేవు. ఒక్కటి కాదిక్కడ బాధ! ఇక్కడ స్ఖలనమే శృంగారపు గ్రాండ్ ఫినాలీ కాదు; తర్వాతి నైరాశ్యపు లోతుల్నీ అంతే తీవ్రతతో ఎదుర్కోవాలి. ఇక్కడ నిన్ను కత్తితో పొడిస్తే ఎరుపు టింటున్న ఏషియన్ పెయింట్‌లా రక్తం చిమ్మి ఊరుకోదు; తోడుగా మెలి తిప్పే బాధనూ భరించాల్సిందే. ఇక్కడ నీ స్నేహితులు, స్నేహితులే; శత్రువులు శత్రువులే. ఎందుకు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావ్! అర్థం చేసుకో.”
ఈ వాదనతో అతన్ని చాలా మట్టుకు జయించానని అతని ముఖమే చెప్తుంది. చూపులు నేలకు వాల్చి ఆలోచిస్తున్నాడు. చివరకు తలెత్తి, దిగాలుగా, ఆఖరి ప్రయత్నంలా, “అయినా నాకా నలుపూ-తెలుపూ ప్రపంచం నచ్చలేదు,” అన్నాడు.
సందు దొరకడంతో నేన్రెచ్చిపోయాను: “నచ్చక చేసేదేం లేదు. నువ్వో స్వప్న శకలానివి. నాలో ఏ రెండు రాండమ్ న్యూరాన్లు యాదృచ్చికంగా రాజుకున్నాయో, నువ్వూడి పడ్డావ్. నా వాస్తవ జీవితంలోని ఎవరి ముక్కో, ఎవరి కన్నో, మరెవరి మూతో కలగాపులగమైతే పుట్టిన కిచిడీవి! యూ డోంట్ బిలాంగ్ హియర్. నిన్నెలా నీ చోటికి పంపించాలో నాకు తెలుసు,” అంటూ ఒక్క ఉదుటున కూర్చున్న వాడినల్లా దబ్‌మని మంచంపై ఒరిగి, దుప్పటి నఖశిఖ పర్యంతం ముసుగు లాగేసుకున్నాను. మళ్ళీ యిందాకటి ఆ పాడు కలలోకి వెళ్ళి అతణ్ణి ఆ మాయదారి నిడదవోల్లో దింపేసి, నేను తిరుగు రైలెక్కి గదికి చేరుకుందామన్నది నా ఆలోచన. కళ్ళు గట్టిగా బిగించి నిద్రకుపక్రమించాను. ఆలోచనల్ని, దృశ్యాల్ని ఆవలికి తోలి మెదడును చీకటి పుచ్చడానికి ప్రయత్నించాను. అతడు కుర్చీ లోంచి లేచి గొణుక్కుంటూ గదంతా పచార్లు చేస్తున్న అలికిడి మూసుకుపోతూన్న శ్రవణేంద్రియాలను లీలగా తాకుతుంది. నాకు జోల పాడటాని కన్నట్లు మంచం కూడా లయబద్దంగా ఊగ సాగింది. కాసేపటికి, అంతా ప్రశాంతమైన శూన్యం ఆవరించి పూర్తి సుషుప్తిలోకి జారిపోతున్నాననగా — నా చేతిని సందిగ్ధంగా తడుతున్నట్టు అతని స్పర్శ తగిలింది. కోపం బద్దలై “చచ్చేవ్‌రా నువ్వ”నుకుంటూ దిగ్గున లేచి కూర్చున్నాను.
నా నుండి ఇంత చురుకైన ప్రతిక్రియ ఊహించలేదనుకుంటా; ఉలిక్కిపడి వెనక్కు తగ్గాడు. రైలు కుదుపు క్రమంగా కుదుట పడుతుంది. కిటికీ మసక చీకట్లో ఏదో ప్లాట్‌ఫాం వెనక్కి జారుతూ కనిపిస్తుంది. జారి జారి, స్థిరపడింది. “ఛాయ్! ఛాయ్!” అని అరుచుకుంటూ ఓ కుర్రాడు మా కంపార్ట్‌మెంట్ దాటుకుని వెళ్ళాడు.
“నన్ను లేపుతానని చెప్పి మీరే పడుకుండిపోతే ఎలా గురువుగారూ... పదండి... ఇదే నిడదవోలట” అంటూ, భుజాన లగేజీతో, మంగోలియన్ కళ్ళు చికిలించి నవ్వుతున్నాడు.
“We are such stuff as dreams are made on; and our little life is rounded with a sleep.”

— Shakespeare
అబ్బబ్బా.. ఎంత బావుందో ! వేగంగా చదివితే అనుభూతి కోల్పోతానేమో అని మెల్లగా చదువుదామంటే .. మీ పదాలు పరిగెట్టిస్తున్నాయ్.చదివిందే మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.
ReplyDeleteచాలా బాగుంది అనేది చాలా చిన్న మాటేమో అనిపిస్తుంది
ReplyDelete