తుఫాను అలలపై సొమ్మసిల్లిన ఓడ
నీరెండ ఒడ్డును కలగన్నట్టు,
తెల్లటి మాయేదో కమ్మిన స్నేహోద్రేకంలో
దొరికిన నెంబర్‌కి ఫోన్ చేస్తావు
వినిపించిన గొంతునల్లా అల్లుకుపోదామని.
ఒక్కో చువ్వా పేర్చి కట్టుకున్న ఇనుప పంజరంలోంచి
నువ్ వెలార్చే యీ స్నేహఋతు కూజితం వెనగ్గా
జీరగా గీరుకునే ఒక ఆలాపనను
అవతలి మనిషి విన్నూవచ్చు వినలేకపోనూవచ్చు.
మీ మాటలు మర మీది బెల్టుల్లా తిరుగుతుండగానే
నీ తలుపులు ఒక్కోటిగా మూతపడుతుంటాయి
నిజం లెక్కలేనన్నోసారి నిన్ను క్షమించి చేతులు చాస్తుంది
దాని అనాదరపు కౌగిట్లోకి నీరసంగా చేరతావు, ఫోన్ పెట్టేసి.

Loved it..ఎంత బాగుంటాయ్ మెహెర్ మీ కవితలు. "మర మీది బెల్టుల్లా" - వేలేదో మర కింద పడ్డట్టు- ఎంత నొప్పిగా అనిపించిందో ఆ phrase చదవగానే.
ReplyDelete