September 7, 2022

పది

బడిలో బల్లల మీద సందడిలో నీ నూగు చెంపల నవ్వు మొదటిసారి నా కళ్ళల్లో మెరిసీ... ఒప్పుల‌కుప్పాటల్లో ఎగిరే నీ రెండు జెళ్ళపై ఎండ తళుకు నా మనసు గోడలపై వెలుగులుచిమ్మీ... ఉయ్యాల విసురులో అలల నీ గౌను తరగల మీద నా బాల్యం రెపరెపలాడీ... నన్నిప్పుడు కమ్ముకొని కాపాడుతున్న ఒక కౌగిలి కోసం మరి అప్పుడే గాలుల్లో ఏం సమాయత్తాలు జరిగాయో... గోపురం గూళ్ళల్లో ఎర్రముక్కు రాంచిలకలు ఏం జాతకాలు కలిపాయో... దేవుళ్ళు నడిచివెళ్లిన ధూళుల్లోంచి సుళ్ళు తిరుగుతూ రాలిన ఏ దీవెనలు ఆనాడే మనపై దేవగన్నేరు పూలై కురిశాయో... సీవండి మబ్బుల వెలుగులో నాచుఇటికెలగోడ మీద గమ్యంలేని గాజుపురుగుల జంట ఒకదాన్నొకటి మోసుకెళ్తూ... జీవితం మీద మత్తిల్లి వాలిన ఋతువుల్ని సుతారంగా దాటుకుంటూ... ఇలా నన్ను మలిచిన ఇన్నేళ్ళ ప్రయాణానికి... ఉన్నదనే తెలియని కిటికీ ఒకటి తెర్చుకుంటే, సూర్య రేణు సంచలనమై జాల్వారిన ఈ మొదటి పదేళ్ళకి... లవ్యూ షామా! Thank you for shaping me up and putting me back on the rails! 😘


0 comments:

మీ మాట...