నేను Seinfeld రెండోసారి చూద్దామని మొదలుపెట్టి మూడో సీజను దాకా వచ్చేసరికి చిన్నోడికి ఒంటిపూట బళ్లు మొదలయ్యాయి. ఇంక వాడూ నాతో చూట్టం మొదలుపెట్టాడు. అలా ఈ వేసవి సెలవుల్లో రోజుకి రెండు మూడు ఎపిసోడ్లు చొప్పున మిగతా ఏడు సీజన్లూ ఇద్దరం కలిసి చూసేశాం. పెద్దాళ్ల షో అయినా, అందులోని సిల్లీనెస్ ని వాడూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి నాకూ కూడా Kramer కేరెక్టరు అంటేనే ఇష్టం. ఒకటి రెండు ఎపిసోడ్లు వాడి వయసుకి నప్పవనిపించినవి స్కిప్ చేశాను. ఇంకా ఎండలు ముదరని కొన్నాళ్లు మటుకు కొన్ని రోజులు పొద్దుటిపూట్ల ఊరకే వీధుల్లో తిరిగాం. ఎండలు ముదిరి ఇంట్లోకే confine అయ్యాకా ఇక అక్కడ కాలక్షేపానికి వేరేవి వెతుక్కోవాల్సి వచ్చింది. నేను చూద్దామనుకునే సినిమాలూ, చదవాలనుకునే పుస్తకాలూ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇద్దరం చూడగలిగేవీ చదవగలిగేవీ... వాటి జోలికే వెళ్దాం అని నిశ్చయించుకున్నాను. Seinfeld ఒక్క విషయంలో మాత్రమే నా స్థాయికి వాడ్ని లాక్కొచ్చాను. ఇక మిగతావన్నీ వాడి లెవెల్‍కి నేను వెళ్ళాల్సి వచ్చినవే. ఈ వేసవి సెలవుల్లో వాడికి Anime shows, Manga books పరిచయం చేద్దాం అనుకున్నాను. మామూలుగా నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ వాడికోసమే మెయిన్‌టైన్ చేస్తుంటాను. కానీ అందులో అమెరికన్ షోస్ అన్నీ ఒకే పాటర్న్‌లో, మరీ పొలిటికల్లీ కరెక్టడ్‌గా, అన్నింటినీ తేలిగ్గా తీసిపారేసే టిపికల్ అమెరికన్ హ్యూమరుతో వెళ్తున్నాయనిపించింది. అందుకే Anime, Manga వాడికి పరిచయం చేద్దామనిపించింది. ఎప్పుడో 80'sలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న Dragon Ball సిరీసులు మొత్తం డౌన్లోడ్ చేసి చూపించాను. నేను కలిసి అన్ని ఎపిసోడులూ చూడలేదు గానీ, నేను మిస్సయిన ఎపిసోడ్లలో కథ ఏమవుతుందో నెట్‌లో చదివి నన్నునేను అప్డేట్ చేసుకున్నాను, వాడితో మాట్లాడటానికి కామన్ టాపిక్స్ కోసం. ఆ విధంగా Goku అనే ఆధునిక పురుషోత్తముడు ఇద్దరికీ హాట్ టాపిక్ అయ్యాడు. గత ఏడాది నేను సాధించిన గొప్ప విజయాల్లో చిన్నోడికి ఇంగ్లీషు చదవటాన్ని వాళ్లు టీచర్లు నేర్పించలేనిది నేనే ఒంటిచేత్తో నేర్పగలగటం ఒకటి. Diary of a Wimpy Kid మొదటి రెండు వాల్యూములు నేను చదివి వినిపించినా, మూడో వాల్యూము నుంచి ఏడో వాల్యూము దాకా వాడే చదువుకున్నాడు. ఆ ఇన్‍స్పిరేషన్‌తో డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. దానికి కొనసాగింపుగా ఈ వేసవి సెలవుల్లో One Piece మంగా బుక్స్ కొన్నాను. మూడు వాల్యూములు ఇలా అమెజాన్ నుంచి పుస్తకం రాగానే అలా గంటలో చదివేశాడు. తర్వాతి పుస్తకం కొనటం లేటయితే, ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. గత వేసవి సెలవుల్లో ఇంగ్లీషు చదవటం నేర్పినట్టే ఈ సెలవుల్లో తెలుగు నేర్పుదాం అని కొన్ని క్లాసులు తీసుకున్నాను కానీ, కంటిన్యువస్‌గా చెప్పటం కానీ నా వల్ల కాలేదు. కలిసి చూసిన సినిమాలు: Ratatoullie, Minnal Murali, The Emperor's New Groove. మిన్నల్ మురళి వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ కలిసి బొమ్మలు కూడా వేశాం. వాడి బొమ్మలు చాలా మెరుగయ్యాయి. అలాగే ఈ నెలతో Chess.com అకౌంటుకి డబ్బులు కట్టాను. ఇద్దరం కలిసి ఆడటం, లేదా ఆ అకౌంటులోకి వెళ్లి అపరిచితులతోనో, చెస్ bots తోనో ఆడటం... అదో కాలక్షేపం. నన్ను తొందరలోనే మించిపోయాడు. అంటే పెద్ద పాయింట్లేమీ కాదు. నాలుగొందలు దాటాడంతే. ఇలా చెస్ ఆడటం, లేదా యూట్యూబులోకి వెళ్లి Magnus Carlsen, Hikaru, Gotham chess... వీళ్లవో, వీళ్ల గురించినవో చెస్ వీడియోలు చూడటం... అదో పెద్ద కాలక్షేపం. ఇంకోటి, వాడిలొ హ్యూమరు, నన్ను నవ్వించగలగటం నేను కొత్తగా గమనిస్తున్న విషయాలు. అలా మొత్తానికి ఎందుకో ఈ వేసవి సెలవులు పొద్దస్తమానం బాగా కలిసి గడిపి ఇవాళ మొదటి రోజు స్కూల్లో దింపుతుంటే చిన్న బెంగ. నా నైట్ డ్యూటీస్ వల్ల మళ్లీ ఏడాదికి గానీ ఇలా దొరకడు.
June 12, 2023
September 29, 2022
Scary Night in the New House
(I wrote it so that I can read it aloud to my son. And he liked it. :) Sparko is our ill-tempered pet parrot.)
I will tell you about the first time I was brought into this new house. It was probably like five months ago. I am not really sure. I don’t know how to count days and months. You see I am still a baby. I was taken to this new house on scooter. Amma brought me here. I mean not MY Amma. I don’t know what to call her. Or any of these three people. They are a family. A family of three people. ‘Naanna’, ‘Amma’, and ‘Chinnamma’. I don’t know their real names. I know only the names that they call each other with. Chinnamma is a small kid. Amma is a big woman. And Naanna is a big man. Naanna is also called Phani, both by the kid and the woman. I guess that’s his real name. He looks weird. He has no hair on his head where it’s supposed to be. And whatever is left is all white. Sometimes he changes his style. Like recently he suddenly took off his beard and colored his hair black. I could not even recognize him. I was scared by this new person. But slowly realised it’s the same old Naana, or Phani (a ‘funny’ sounding name, that one). Ok, let me go back to where I left off my story. I was telling you about the time I entered this new house, right? Amma brought me here on a scooter and left me in a closet. I didn’t even get a chance to look around the house. But by whatever I could see, the house looked empty, without any things in it. Amma opened the lock, entered this empty creepy-looking house, and walked straight to the next room and put me in a closet. And she then left the house, leaving me alone inside my cage. I mean she left me some food and all, but still, it was a scary experience. It would have been even more scarier had she closed the door to the closet. But thankfully she left it open a little. But all I could see through that crack of the door is an empty wall. I thought these people abandoned me for good! I thought I would die here alone. Or some bad guys would come and get me. At first, there was still some light coming in through the window. But slowly the light became dull until it was just plain dark. Darkest of the dark! And me alone in my cage, left to think my scary thoughts.
I am not really sad about these people leaving me. Because it’s not like they are my parents. I know them only for like one month. They used to live in an another house. That’s when Amma bought me for five hundred rupees. I am kind of glad she did that. Because the people who sold me to her were horrible people. You wouldn’t even believe what they did to me! One day a man just took a pair of scissors and cut my wings off! I mean part of them. It was the scariest day of my life! I saw my own little feathers scattered all over the floor, before somebody came in with a broom stick and cleaned them away to probably throw them in the dustbin. Those were a pretty pair of wings. I thought they were the only thing that’s gonna save me from those horrible people. I was thinking about using those wings to escape when the time seemed right. I was thinking about flying back to my parents.
I guess it’s time to tell you about my parents. Both my mom and dad were very good looking and green looking. Me and my brothers used to wait around for them in the nest all through the day. You can’t even believe how red my Mom’s beak was! She was just a beautiful lady. I used to wait all day for that beautiful beak to show up and push some food into my mouth. They used to come very late. I guess it was difficult for them to find food for me and all my brothers and sisters. We were a hungry bunch. We used to make a lot of noise around the nest. Dad used to scold us. He once said, “If you make a lot of noise like this, some snake or cat would hear you, and snatch you away”. I asked him, “What would the snake and cat do to us?” Dad was about to say something, but Mom stopped him. “Don’t frighten the kids!” she angrily said. I don’t know what Dad was about to say! I still wonder what it could be. But no matter what it was, it certainly could not be scarier than being left alone in an empty closet in an even emptier house. The only thought that saved me through that long, dark night was the memories of my parents. They were not many though. It’s not like I lived with my parents for years. I only lived with them for two months. Those days were the happiest of my life. There was nothing much to do. For the first few days after I was born, all that was there to do was to wait around for my parents. Our nest seemed so big, I guess probably because I was so small. I was ugly looking too. All these green feathers I have now were not there when I was born. I was quite crummy looking I must say. Even my brothers and sisters are like that too. You know one funny thing? Before they became my brothers and sisters, they were just eggs! Can you imagine that. But soon, one after the other, eggs kept cracking and these ugly slimey looking creatures started poppinng up. At first I was pretty scared. I thought they were some kind of monsters invading my nest. But Dad told me they were my brothers and sisters. They were a noisy bunch. I am not any less noisy though. After the first few days, everyone of us started getting feathers. We used to fluff ourselves up to show off. Mom was so happy. I was kind of her favorite kid. How do I know that? Because it’s me she chose to teach flying lessons first. Those were difficult at first. I used to be surprised at the heights Mom and Dad could fly to. They were almost touching the clouds. But all I could fly to was the very next branch to our nest. I was ashamed. I wanted to be like Mom and Dad, as soon as possible. But mom said “No hurry, everything in its time”. The tree I used to live in is a ‘Jaaama’ tree. But I hated Jaama kaayalu. I wanted to land on faraway trees and try new fruits. But mom said, “Never go beyond the Jaama tree, you are still too young for that. Just eat the fruits in this tree first”. I said OK. But I wanted to try anyway. That’s when the saddest thing in my entire life happened. I was trying to fly to the other tree but my weak wings gave away and I fell on the ground. I was about to go back to the Jaama tree where my nest was. But suddenly I heard some foot steps and a monster came running around and he just caught me. Well I thought it was a monster anyway. Later I realised it was a human. That’s the first human I ever saw. They are strange creatures, these humans. They don’t have wings and tails. And they are not even like animals. They walk only on two legs. But they are mean. They don’t kill you or anything, but they don’t treat you good either. After that first human snatched me , I went though the hands of several other humans. And finally landed on those horrible people who cut my wings off. I was scared, I thought they would cut my legs too. But, fortunately Amma came and bought me from them. For five hundred rupees. Was I costly or cheap, I don’t know.
At first I thought Amma also belongs to the horrible-kind. Who knows. You can never trust these humans. They can be pretty mean when they want to. So I was very worried when Amma took me to her house. The house was even higher than the tree where our nest used to be. It has many stairs. From there I could see many houses and a whole lot of sky. Amma opened the door and took me inside. She was carrrying me in a cage all this while. Then I saw this kid who was inside the house. That kid just jumped up from the chair he was sitting when he saw me. He was clapping and making a lot of noise. I was scared. They tried to make me come out of the cage. But I just didn’t want to. I started to threaten them with my beak. But they put some cloth around their hands and snatched me away from inside the cage. These two people wanted to pet me or something. But I didn’t even let them near me. I climbed all over the curtains and tried to be out of reach from their hands. But the curtains are not so high. They eventually caught hold of me. God! The kid was jumping all over the place! Amma was kind of gentle and nice. But this kid, you could never know what he would do next! I tried to be as far away from him as parrotly possible. Amma asked HIM to name me. Can you believe it? This crummy looking kid’s gonna name me like he is my parent or something. He didn’t even think much before naming me. He just put his finger on his chin like he was a scientist or something, and just said “Sparko!”. At first that name kinda felt weird. It still feels weird. It’s a nice name and all. But I still have to get used to it.
Then later that day, ‘Naana’ came home (he is also sometimes called “DaaDDa”, I don’t know how many names that guy’s got. I forgot to tell you, Amma also calls him “Phanammaa”!). One good thing, even a funny thing, about him though: he is scared of ME! Can you believe that! He didn’t even try to touch me. Once Amma snached me from the curtains with her hands and tried to put me in his hands. You know what he did? He just ran away to the next room and locked the door from inside! I guess that was the first human I ever saw who was scared of me! It felt funny. It felt good too. Well, one less person to be scared of, I thought. First night was kind of tiresome. They just wound’t let me sleep! They were showing me videos of some parrots. All the parrots in those videos were acting all cute, like they love human beings and stuff! That really surprised me. How can you be so happy around humans who snatched you away from your parents. I don’t know. May be they were different. May be their parents also belong to the humans. Or they were just acting. Amma and Vijju (—Oh, I forgot to tell you, this kid has an another name too. Amma calls him Vijju, Naana calls him Chinnamma. Naanna also calls the kid with many other weird names. Like ‘Chin Chin Mun Mun’, ‘Chin Chineswar’, ‘Bujjamma’, ‘Bungamma’, ‘Bronky’… and many more that I can never remember for the life of me. It’s like he got an endless supply of names for that kid. He even started inventing new names for me. He comes late at night from the office and calls me with all these cutesy sounding names–like Sparkle, Sparkly-thingy, Sparker…. I just want to punch him in the face or go bird-potty on his left eye whenever he calls me with these weird sounding names. But by the time he comes home I am usually too hungry to mind whatever the stupid names he is calling me with). Anyways, what I am about to tell you was, on those first days Amma and Vijju made me watch a whole lot of parrot videos. To make me feel at home I guess. But I hated them. They were all acting all cutesy and happy before humans. That really bugged me. I hated all of them. They were big losers and slaves. Acting nice to humans so that they can get treats and get by nicely. Some of them are even trying to talk like humans! What a sick joke! I cannot forgive those parrots for doing that. Amma and Vijju soon learned that I don’t really care about those losers, so they stopped showing me anymore of those videos.
The days in that house were very hot. I guess it was summer. They put my cage just near the door on a red looking thingy. I hated being just beside the door. Everytime somebody opened the door, I got worried some enemy came. I slowly got used to that. First, I figured out these three people were not my enemies. I mean I still don’t like them and all. But they are not my enemies. And I also figured out that this family is only made up of these three people. That surprised me. Mine was a big family. But these guys got nobody except themselves. Well, I guess I will be the fourth one. But first I have to like them right?
It’s not so easy I tell you. Most of all with that kid! God he is so noisy. He can’t sit on his butt for like one minute. Always moves around like a busy cockroach. And he was always trying to touch me. At the same time he was also kinda scared to touch me. My only weapons to keep him away from me were my poops. He hated my poops. So whenever he tried to hold me, I just pooped on him. My stinky poop. At first he was like “Eewwwww”. But you know one funny thing? Amma and Naana gave HIM the job of cleaning my poops. So my plan to use my poops against him didn’t work anymore. Because, with all that cleaing, he kind of got used to my poops and stopped worrying about them. I pooop, and he just brings a white papery thingy and cleans it up. I slowly got used to that place. I even started to like it to tell you the truth. Because it has a nice view and all. But just when I started thinking that that was the house where I was going to spend the rest of my life, this sudden change happened. Amma brought me on her scooter, and left me in this empty closet in an even emptier house.
That night in this new house is the longest night I have ever been through. It kept going on like forever. All I could do to spend the time is to think about my small nest in a place I can only remember as green. I wondered what my Mom and Dad would be doing right now. Would they even miss me? Or would they just forget me and take care of my brothers and sisters like nothing ever happened. I am sure my mother would miss me. I remembered her beautiful red beak. That night in the empty closet I even dreamed that she came to feed me. In that dream, I forgot that I was in this iron cage, I thought I was still living in the forest. And I swear I even heard the flapping of Mom’s wings too. And her landing on the nest. I was so happy. The happiness became all fluffed up like a balloon inside me, and suddenly, I woke up! But I was still in that damn dark closet. And everything felt heavy and sad.
After many long hours like that, the night was at last over. Suddenly the door of the closet opened and I saw Naana’s face. I was so relieved! I never felt so happy seeing anybody’s face. These guys haven’t abandoned me after all. I still belong to them. That day was a very busy, noisy, dusty, dirty day. People were all over the place. They were carrying things. Some of the things I remembered form the old house. Only then did I realise that these guys were actually changing their houses. I guess they didn’t want me to come along with all these heavy things. That’s why they brought me here a day before. Thank god! I thought they left me for good, and some other bad humans are gonna come and get me. Though I still didn’t like these three people, I was pretty glad to see them back. I guess they are going to be the only family I am ever going to have. I might as well learn to like them.
September 7, 2022
పది
బడిలో బల్లల మీద సందడిలో నీ నూగు చెంపల నవ్వు మొదటిసారి నా కళ్ళల్లో మెరిసీ... ఒప్పులకుప్పాటల్లో ఎగిరే నీ రెండు జెళ్ళపై ఎండ తళుకు నా మనసు గోడలపై వెలుగులుచిమ్మీ... ఉయ్యాల విసురులో అలల నీ గౌను తరగల మీద నా బాల్యం రెపరెపలాడీ... నన్నిప్పుడు కమ్ముకొని కాపాడుతున్న ఒక కౌగిలి కోసం మరి అప్పుడే గాలుల్లో ఏం సమాయత్తాలు జరిగాయో... గోపురం గూళ్ళల్లో ఎర్రముక్కు రాంచిలకలు ఏం జాతకాలు కలిపాయో... దేవుళ్ళు నడిచివెళ్లిన ధూళుల్లోంచి సుళ్ళు తిరుగుతూ రాలిన ఏ దీవెనలు ఆనాడే మనపై దేవగన్నేరు పూలై కురిశాయో... సీవండి మబ్బుల వెలుగులో నాచుఇటికెలగోడ మీద గమ్యంలేని గాజుపురుగుల జంట ఒకదాన్నొకటి మోసుకెళ్తూ... జీవితం మీద మత్తిల్లి వాలిన ఋతువుల్ని సుతారంగా దాటుకుంటూ... ఇలా నన్ను మలిచిన ఇన్నేళ్ళ ప్రయాణానికి... ఉన్నదనే తెలియని కిటికీ ఒకటి తెర్చుకుంటే, సూర్య రేణు సంచలనమై జాల్వారిన ఈ మొదటి పదేళ్ళకి... లవ్యూ షామా! Thank you for shaping me up and putting me back on the rails! 😘
June 28, 2022
picking you up at school on a rainy day
వర్షం వల్ల స్కూలు గేటు ముందు జనం మరీ ఎక్కువమంది ఉంటారని తెలుసు. కాస్త ఆలస్యంగా వెళ్దామని అనుకున్నాను. కొత్త ఇంటిలోకి వెలుతురు సరిగా రాదు. పగలు కూడా లైట్లేయాలి. బైట బళ్లు పార్కింగ్ చేసే చోట కూడా అంతే. ఇవాళ మబ్బుబట్టి చినుకులు పడుతుంటే ఇంకా మరీ చీకటిగా ఉంది. కాసేపు దోమల్ బాట్ పుచ్చుకుని బైట బళ్ళ దగ్గర దోమల్ని కొట్టాను. పట పటమని మెరుస్తూ బాట్ పేలటం బాగుంటుంది. అది పట్టుకుని కాసేపు మినీ Thor లాగా ఫీలయ్యి, మొత్తానికి పది నిమిషాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాను. అయినా సరే స్కూలు గేటు ముందు జనం కిటకిటలాడిపోతున్నారు. చినుకులు ఎక్కడైనా బావుంటాయి కానీ, బట్టతల మీద బాగోవు. హెల్మెట్ తీయకుండానే ఆ పేరెంట్స్ గుంపులోకి దూరి, అక్కడ మైకుపట్టుకుని పిల్లల్ని పిలుస్తున్న టీచరుకి వినపడేలా, అలవాటులేనంత గట్టిగా నీ పేరు అరిచి చెప్పి, మొత్తానికి నిన్ను బైటకి తీసుకువచ్చాను. You looked tired. And happy. అక్కడున్న రద్దీ వల్ల బండి దూరంగా పార్క్ చేశాను. అక్కడిదాకా ఇద్దరం నడిచి వెళ్తుండగా అప్పటికప్పుడు అబద్ధం చెప్దామనిపించింది. ఇవాళ బండి తేలేదని, మనమిద్దరం నడిచే ఇంటికి వెళ్లాలని చెప్పాను. నువ్వు ఘోరంగా రకరకాలుగా నన్ను తిడుతుండగానే, మనం బండి దగ్గరకి వచ్చాం. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు బిల్డప్ ఇచ్చి- "అరె ఈ బండి ఎంత మంచిదిరా.. సీక్రెట్ గా నన్ను ఫాలో అయి ఇక్కడిదాకా ఒచ్చేసిందీ" అన్నాను. నువ్వు వెంటనే జోక్ అందిపుచ్చుకొని- "ఎంత బుజ్జిముండ" అని దాన్ని హెడ్ లైట్ దగ్గర పట్టుకుని ముద్దు చేశావు. బండి డిక్కీ తీసి లోపల నీ కేరేజీ పెడుతుంటే అవినాష్ గురించి చెప్పావు. ఈమధ్య వాడు నీకు స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడని, వాడు కనపడ్డం నీకు నచ్చటం లేదని చెప్పుకొచ్చావు. I didn't see any basic human reasoing in it, but I liked how you put it. మీరిద్దరూ సింక్ దగ్గర ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకున్నారట. టీచర్ ఇద్దర్నీ మోకాళ్ల మీద నిలబెట్టిందట. నువ్వు చెప్తున్నంత సేపూ నేను ఈ అవినాష్ గాడ్ని అశుతోష్ తో కన్ఫ్యూజ్ అయ్యాను. టీచర్ కొట్టకుండానే 'కొట్టొద్దు టీచర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్' అని బాడీ మెలికలు తిప్పేసి మరీ ఓవరేక్షన్ చేసే అశుతోష్. నా జెర్కిన్ నీకు తొడిగి, నా హెల్మెట్ నీకు పెట్టాక, బయల్దేరాం. నువ్వు హెల్మెట్ గ్లాస్ మూసుకున్నావు. అందులోంచి మాట్లాడుతుంటే నీ మాటలు స్పష్టంగా వినపడటం లేదు. "ఆ...ఊ" అంటున్నాను. స్కూలు దగ్గరలో ఏదో బిల్డింగ్ కూలగొడుతున్నారు. నీకు చూపిద్దామని ఆపాను. ఆ క్రేన్ అంచుకి ఒక పెద్ద ఇనుప పిడికిలి ఉన్నట్టు ఉంది. It kept punching up the walls like a WWE wrestler. ఇద్దరం కాసేపు ఆగి చూసి బయల్దేరాం. నువ్వు లాంగ్ రూటులో వెళ్దామన్నావు. ఈ వర్షాన్నీ ఈ వాతావరణాన్నీ హెల్మెట్ గ్లాస్ లోంచి చూట్టం నీకు నచ్చిందనుకుంటా. కానీ ఇక్కడ నా బట్టతల మీద చినుకులు.. చిరాకు దొబ్బుతోంది. రోజూ వెళ్ళే రూటులోనే తీసుకొచ్చాను. నువ్వు వెనక నుంచి చేతులు ముందుకుతెచ్చి వాటిని నా పొట్ట మీద కలిపి రెండు చేతులూ వేళ్ళతో మెలేశావు. ఒక స్పీడ్ బ్రేకర్ మీంచి బండి గెంతినప్పుడు అప్పటికే వర్షానికి తడిసిన నీ చేతులు ఒకదాంట్లోంచి ఒకటి జారిపోయి భయపడ్డావు. ఏం మాట్లాడుకున్నాం? I guess we talked about people, how we hated them today for being all over the place. రోడ్డు మీద అక్కడక్కడా విరిగిన తురాయి కొమ్మలు. పళ్ళ మార్కెట్లో నేరేడుపళ్లు చినుకుల్తో మెరవటం చూశాను. ప్రపంచంలోని పర్పుల్ రంగంతా వాటి నుంచే వచ్చిందనిపింది. మధ్యలో గుర్తొచ్చింది- నువ్వు నిన్న 'Behka Mai Behka' పాటని ఇష్టంగా విన్నావని. I tried to hum. You told me to shut up. So I did. మధ్యలో ఒక వేప చెట్టు బాగా లేత అకులతో ఉంది. ఎంత లేత అంటే అస్సలు ముదురాకులే లేవనిపించేట్టు. బండి స్లో చేసి చూపించాను. You seemed to be as surprised and as happy to see it as i did. More than me infact. మలుపులు తిరిగి ఇంటికొచ్చేశాం. గేటు దగ్గర కూడా బురద బురద. గేటు బైటకి తీయాలో లోపలికి తీయాలో నీకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. ఇంట్లోపలికి వెళ్లాకా కూడా నువ్వు ఆ పెద్ద హెల్మెట్టూ, నీకు పాదాల దాకా వచ్చే జెర్కిన్నూ తీయకుండా, బుల్లి ఏలియన్ లాగా కాసేపు గెంతావు. అద్దం ముందు ముడ్డూపుతూ డాన్స్. ఇంట్లో తడి చేస్తున్నావని బలవంతంగా విప్పించాను. తర్వాత స్పార్కోని చేతిలోకి తీసుకుని కాసేపు ఆడించటం మొదలుపెట్టావు. నేను కూడా తల తుడుచుకుని, settled back into the dry cosy land of home.
May 17, 2011
అలా తిరిగి రావాలని...
నాకు చిన్నప్పటి నుండీ ప్రయాణాలంటే పెద్ద మక్కువ లేదు, అలాగని మరీ విరక్తీ లేదు. చిన్నప్పుడు తిరిగింది ఎక్కువగా బస్సుల్లోనే. అది ఆహ్లాదకరమైన అనుభవం కాదు. ఆ దుమ్ము రేగే బస్టాండ్లూ, బస్సుల్లో ఇనుము కంపూ, మన అస్థిపంజరం బలమెంతో పరీక్షిస్తున్నట్టు ఆపాదమస్తకం జాడించి వదిలేసే రోడ్లూ, అప్పటిదాకా యింటి చుట్టూ తెలిసిన పరిసరాల్లో అలవాటు మగత కప్పుకు పడుకున్న మనసుపై ఉన్నపళంగా దాడి చేసే తెలియని మొహాలూ పరిసరాలూ, లగేజీ బాధ్యతలూ, రావాల్సిన చిల్లర గుర్తుపెట్టుకోవడాలూ, కిటికీలోంచి జేబురుమాళ్ళు విసిరి సీటేస్సుకునేవాళ్ళూ... ఇవన్నీ చికాకు పెట్టేవి. కానీ, ఒక్కసారి కిటికీ దగ్గర సీటు దొరికిందా... అన్నీ మరిచిపోయేవాణ్ణి.
రైలు ప్రయాణాలంటే మాత్రం చాలా యిష్టం. అసలు రైలంటేనే ఏదో ఆకర్షణ. రైలు డోరు దగ్గర నిల్చునే వీలు దొరికితే చాలు గమ్యం ఎప్పటికీ చేరకపోయినా ప్రయాణపు పరమార్థం దక్కేసినట్టే. (డోరు దగ్గర నుంచున్నంత సేపూ నా సీట్లో ఏం జరుగుతుందన్న ధ్యాస వుండదుగానీ, సీట్లో కూర్చోవాల్సి వచ్చినపుడు మాత్రం ఆ డోరు దగ్గర చోటెవడన్నా ఆక్రమించేస్తాడేమోని కంగారు పడతాను యిప్పటికీ.) ఇరుపక్కలా వెదజల్లబడిన జీవిత పరిమళాల్నెన్నింటినో ఏరి, తన పట్టాల దారానికి ఒద్దికైన కదంబంగా రైలు వేగిరం అల్లుకుంటూ పోతుంటే, ఆ పరిమళాలకు మనసు తలుపు తెరిచిపెట్టి నిల్చోవడం నాకు ఎప్పటికీ పాతబడని ఆనందం. అసలు స్పందించగలిగే మనసుండాలే గానీ రైలు తలుపు దగ్గర నిలబడ్డపుడు ఎంత కవిత్వం వేగంగా వెనక్కు దొర్లుతూ పోతుందనీ!
మొన్న ఊరెళ్ళినపుడు కూడా అంతే. తెలవారుతుందనగా సీటు వదిలేసి తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ఎన్నిసార్లు చదివినా ఒకే అర్థం చెప్పే కవిత కూడా, ఎపుడో ఏదో అరుదైన మనస్థితిలో చదివినపుడు కొత్త అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అలాగే యిపుడు కూడా బయటి దృశ్యాలు యిదివరకట్లాంటివే అయినా, ఈ సారి నా మనసు వాటికి కొత్త భాష్యాలు చెప్పింది; వాటిని మరి వేటికో ముడి వేసింది; ఆ కొత్త అన్వయాల నుంచి నేనిదివరకూ గమనించని సత్యాల్ని రాబట్టింది. ఓ చిన్నపాటి జ్ఞానోదయం కూడా కలిగిందని చెప్పాలి. వెనక్కి వచ్చాకా ఓ పోస్టు రాయబోయి తర్వాతెందుకో మానేసాను. ‘rail-door realizations’ అనో ‘an exercise to the literary pedant’ అనో కొన్ని శీర్షికలు మనసులో పెట్టుకున్నాను కూడా. ఈ రెండో శీర్షిక గురించి కాస్త వివరించాలి. రైలు ప్రయాణం గురించి రాస్తూ దానికి ‘సాహితీ ఛాందసులకు ఒక అభ్యాసం’ అని పేరెందుకు పెట్టాలనుకున్నాను? ఎందుకంటే, అలాంటి ఛాందసత్వంతో బాధపడే వారికి వేగంగా వెళ్ళే రైల్లో తలుపు దగ్గర ప్రయాణం చేయడం మంచి విరుగుడుగా పని చేస్తుందనిపించింది. ఎలాగో చెప్పే ముందు, అసలు ఈ ఛాందసత్వానికి కారణాలు ఊహిస్తాను. సాహిత్యాన్ని గొప్ప పరంపర కలిగిన ఒక వ్యవస్థగా చూడడంలో కొన్ని ప్రమాదాలున్నాయి. ముఖ్యంగా సాహిత్యమే ప్రధాన వ్యాసంగంగా కలవారికి ఈ ప్రమాదం జరిగే అవకాశాలు మరీ ఎక్కువ. ఈ మహానిర్మాణపు మాయలో పడిపోతాం. యిది స్వచ్ఛందమనీ, స్వయంసమృద్ధమనీ నమ్మడం మొదలుపెడతాం. దీనికి జీవాన్నిచ్చే వేర్లు చుట్టూ జీవితంలో పాతుకొని వున్నాయన్న సంగతి విస్మరిస్తాం. పనిముట్టు సొగసుగా వుందని దానితో పని చేయించుకోవడం మానేసి గూట్లో పెట్టి ఆరాధించే ఎడ్డి పనోడిలాగ, జీవితాన్ని అక్షరాల్లోకి వడగట్టగల సాహిత్యాన్ని పటం కట్టి పూజించడం మొదలుపెడతాం. దాని ఘనమైన పరంపర ముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగాలు పడుతూ, ఆ వ్యవస్థకు మనమే ఆపాదించిన మర్యాదని కాపాడేందుకు సిద్ధాంతాల్ని సృష్టిస్తూ, నియమాల్ని అల్లుతూ, వాటి ఆధారంగా బేరీజులు కడుతూ, నేల నిలకడ చూసుకోకుండా దాని మీద బృహన్నిర్మాణాలు కడుతుంటాం. జీవితాన్ని బయటే వదిలేసి, సాహిత్యాన్ని అద్దాల మేడలో బంధిస్తాం. యిదిగో! యిదే మూసలో కరుడుగట్టిపోతే మనమే సాహితీ ఛాందసులమవుతాం.
ఈ ఛాందసత్వం పటాపంచలు కావాలంటే, ఒక్కసారి జీవితపు బహుముఖీన విశ్వరూపం మిరుమిట్లుగొలుపుతూ మన మనోనేత్రాల ముందు సాక్షాత్కారం కావాలి. అలా చూపగలిగే దృష్టిపథం ఒకటి మనకు కావాలి. రైలు డోరు దగ్గర అది సులువుగా దొరుకుతుందని నా నమ్మకం. జీవితంలోని ఎన్నో పార్శ్వాలకు ప్రాతినిధ్యం వహించే చెదురుమదురు దృశ్య శకలాల్ని త్వరిత గతిన ప్రక్కప్రక్కన చేర్చి మనకు చూపించగలిగే ఒకేఒక్క చోటు అది. ఈ చేరిక వల్ల మనం ఒక దృశ్యంతో మరో దృశ్యానికి లంకె వేయగలుగుతాం. వేర్వేరు పార్శ్వాల్ని ఒకదానితో ఒకటి పోల్చుకోగలుగుతాం. వ్యత్యాసం చూడగలుగుతాం. ఈ వ్యత్యాసాల మధ్య దాగివున్న జీవిత స్వభావాన్ని గ్రహించగలుగుతాం. బస్సూ, కారూ, బైకూ, సైకిలూ... ఏదీ యిలా పనికి రాదు. ఇవి మనల్ని జీవితపు సందడిలో భాగం చేసేస్తాయి. మనం ఏం గమనించాలను కుంటున్నామో దానికి మరీ దగ్గరైపోతాం. స్థూలంగా చూపించే దృష్టి ఉండదు. కానీ రైలు అలాక్కాదు. వేరు చేయగలిగే దూరాన్ని పాటిస్తూనే, అవగాహనకు చాలినంత దగ్గరగా వెళ్తుంది.
ఇప్పుడు కాస్త ఓపిక పడితే... కొన్ని కామాల పరంపర:— కొండలు, గడ్డి మైదానాలు, మామిడితోటలు, వరి పొలాలు, నల్లగా బిగువైన శరీరాల్తో సేద్యగాళ్ళు, కోతలూ కుప్పనూర్పుళ్ళూ, గేదెలూ, ట్రాక్టరూ, గొట్టంలోంచి ఊక కక్కుతూ రైసుమిల్లూ, ఎదుటి బడ్డీకొట్టుని వేలెత్తి చూపిస్తున్న అంబేద్కర్ విగ్రహం, సంతమార్కెట్టూ, పెంకుటిళ్ళ దొడ్డి గుమ్మాలూ, పళ్ళు తోముకుంటున్న లుంగీ, అంట్లు తోముతున్న చీర, గుడి గోపురం, స్కూలు గ్రౌండ్లో నెట్ మీంచి ఎడాపెడా ఎగురుతున్న బంతీ, ముగ్గులేసి వున్న వీధులూ, గాంధీబొమ్మ సెంటరూ, సైకిల్ని వంకరగా తొక్కుతున్న పొట్టి నిక్కరూ, ఊరి చివర ‘రతి రాణి’ని చూపిస్తున్న సినిమా హాలూ, కాసేపు గుప్పున కంపుకొట్టే కోళ్ళ ఫారం, చెరువు గట్టున కొబ్బరి చెట్టుకు ఆనించి వున్న అరిటిగెలల సైకిళ్ళు, పక్కన చుట్ట కాలుస్తూ రెండు తలపాగాలూ, తిరగేసిన ఎక్స్‌క్లమేషన్ మార్కుల్లా దూరంగా తాటి చెట్ల వరస, ఎండలో బంగారంలా మెరుస్తూ గడ్డి మేట్లూ, ఎవరూ కనపడని రైల్వే క్రాసింగూ, వరిపొలాల్లో కొంగల గుంపు, కంకర్రోడ్డు మీద ముఖం చిట్లించుకు పోతూన్న ఎర్ర బస్సూ, దాన్ని ఓవర్టేక్ చేస్తూ నల్ల క్వాలిస్సూ, సంతోషి ఫ్యామిలీ ధాబా, సరుకు లారీలు, పెట్రోలు బంకూ, కిషన్‌చంద్ మార్బల్ టైల్స్ ఫాక్టరీ, క్రిస్టియన్ స్మశానం, బెతెస్త వృద్ధాశ్రమం, అశోక వృక్షాల మరుగులో గవర్నమెంటాఫీసు కాంపౌండూ, ఏవో నడుములూ బొడ్డులూ చూపిస్తున్న పోస్టర్లూ, రైలు బ్రిడ్జి క్రిందనుంచి పోతూ కనిపిస్తున్న ట్రాఫిక్కూ, గడియారస్తంభం, షాపింగ్ కాంప్లెక్సూ, బట్టల షోరూమ్, వేలు చూపిస్తున్న వెంకటేష్ కటౌటూ, బోలెడన్ని స్కూటర్లు గంటు మొహాలు పెట్టుకుని వెయిట్ చేస్తున్న రైల్వే క్రాసింగూ, వీపులు చూపిస్తున్న షాపుల వెంటిలేటర్లలో ఎగ్జాస్టు ఫేన్లూ, బట్టలారేసి వున్న అపార్ట్‌మెంట్ బాల్కనీలు, రెపరెపలాడుతున్న మెడికల్ కాలేజీ యూనిఫారాలూ, పెట్రోలు బంకూ, కనకదుర్గా ఫ్యామిలీ దాభా, కొబ్బరి చెట్లూ, వరి చేలూ, బోరింగు దగ్గర పిల్లల బోసి ముడ్లూ... మళ్ళీ యింకో ఊరూ, మళ్ళీ యింకో పట్టణం, మళ్ళీ యింకో నగరం... యిలా ప్రతీ వీధిలో ప్రతీ యింట్లో ప్రతీ బయలులో ప్రతీ మనిషిలో పై తెరలు తీయగానే ఎన్నెన్నో కథలు ఝుమ్మంటూ ముసురుకుంటుంటే, జీవితం అవిచ్ఛిన్నంగా కళ్ళ ముందు విచ్చుకుంటూంటే, మన చైతన్యపు కొలతకి అందనంత విస్తారంగా పరుచుకుంటూంటే, అప్పుడు, ఆ సమయంలో ఒక్కసారి, కలమూ తెల్లకాగితాలతో నిమిత్తమున్న మన సాహితీ వ్యాసంగాన్ని గుర్తు తెచ్చుకుంటే, అప్పుడు తెలుస్తుంది, అది దాని చేవ ఎంత పరిమితమో. మెలికల గీతల్తో నిర్మితమైన అక్షరాలూ, వాటి కూడికతో నిర్మితమైన పదాలూ, వాటి వెనుక ఏ స్థిరత్వమూ లేక చంచలంగా దోబూచులాడే అర్థాలూ యివన్నీ మొదటికే ఈ విస్తృత జీవిత వైశాల్యాన్ని ఇముడ్చుకునేందుకు ఎంతో చాలీచాలనివీ, అసమగ్రమైనవీను. యిక సాహిత్యాన్ని భాష అంటూ, నిర్మాణ భేదాలంటూ యింకా దాని పరిధిని కుదింపజేస్తే అది జీవితం ముందు పూర్తిగా కుదేలైపోతుంది. కౌగలించుకోవాల్సిన చేతుల్ని వెనక్కి విరిచి కట్టేస్తే మోకాళ్ళ మీద కూలబడిపోతుంది. ఆకాశాన్ని రెక్కల్తో కొలవాలనుకునే పక్షి ప్రయాసలో నిష్పలత్వమే వున్నా, ఆ బృహత్ అభిలాషలో, ఆ స్వేచ్ఛలో ఓ అందం వుంది. కానీ పంజరంలోంచి ఆకాశాన్ని బెంగగా చూసే పక్షిలో అలాంటి అందమేమీలేదు.
నేను ఈ వ్యాసంలాంటి ఏదో రాతలో విషయం నుంచి పూర్తిగా దారి తప్పుతున్నట్టున్నాను. రాయాలనుకుంది వేరు రాస్తోంది వేరు. నాలో కొత్తగా మొదలయిన భ్రమణకాంక్ష గురించి కదా నేను రాయాలనుకుంది. సాహిత్యం జోలికి ఎందుకు వచ్చాను. (నా విషయంలో ఈ రెంటికీ నాకిప్పుడు ఆలోచించే ఓపిక లేని అవినాభావ సంబంధమేదో వుందనిపిస్తుంది.)
తిరుగుడు యావ నాలో చిన్నప్పట్నించీ వుందేమోనని అనుమానించడానికి బస్సు కిటికీ పట్లా, రైలు తలుపు పట్లా నాకున్న మక్కువ తప్ప వేరే ఆధారం లేదు. అసలు భ్రమణకాంక్ష అనేదొకటి మనుషుల్ని పట్టుకుని ఊపుతుందనీ, ఫలితంగా ఎక్కడా కాలు నిలపలేక, ఎక్కడా ఎక్కువకాలం తమని స్థిరపరుచుకోలేక, నిరంతరం కొత్త చోట్లకై అన్వేషించేవారు వుంటారనీ నాకు తెలియదు. తిరగడం అంటే ఏదో గమ్యానికని మాత్రమే నాకు తెలిసింది. చిన్నప్పుడంతా ఎప్పుడన్నా వేసవి సెలవల్లో చుట్టాల యిళ్ళకు వెళ్ళి వచ్చేయడం తప్ప నేను చేసిన దూర ప్రయాణాలు తక్కువ. అప్పుడపుడూ ఊరి చివర లాకుల దగ్గర స్నానాలకూ, మూతబడిన రైసుమిల్లుల్లో ఆటలకీ అభ్రకం పెచ్చులు ఏరుకోవడానికీ, గోదావరి లంకలకూ, స్మశానాలకూ, మామిడితోటల్లో దొంగతనాలకూ నన్ను పురికొల్పింది ఏకతీరుగా విసుగుపుట్టించే స్కూలు జీవితమే తప్ప, కొత్త స్థలాల పట్ల మక్కువ కాదు. కొత్త ప్రదేశాల్లో, కొత్త మనుషుల్తో గడపాలనే యావ లోపలేవన్నా వుండి వుంటే దాన్ని నావరకూ పుస్తకాలు బాగానే సంతృప్తి పరచాయి. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, పుస్తకాలు ఆ లోటు తెలియనివ్వలేదు. ముఖ్యంగా మాక్సింగోర్కీ జీవిత చరిత్ర (ట్రయాలజీ) లాంటి పుస్తకాలు నన్ను కేవలం స్థలం లోనే కాదు, కాలంలో కూడా సదూరంగా తీసుకుపోగలిగాయి.
బైట కూడా లోకం వుందన్నమాట బెక బెక!
డిగ్రీ చదివేటపుడు ఒక సంఘటన మాత్రం నా చిన్ని లోకం మీద బోర్లించిన బుట్టని తిరగేసి ప్రపంచాన్ని కొత్తగా చాలా చూపించింది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన కడియపులంకలో ఏడాదేడాదీ ‘ఫలపుష్ప ప్రదర్శన’ జరిగేది. మేం నలుగురు స్నేహితులం కలిసి బయల్దేరాం బస్సులో. అబిద్ గాడు యింట్లో చెప్పకుండా మస్కాకొట్టి తెచ్చిన డొక్కు కెమెరా ఒకటి మాతో వుంది (అప్పటికింకా డిజిటల్ కెమెరాలు అంత వ్యాప్తిలోలేవు.) ఇక చూడాలి, ఎగ్జిబిషన్‌లోకి చేరేసరికి ఆ కెమెరాతో మా యవ్వారం ‘తోక యెత్తిన కాకి, తోక దించిన కాకి’ అన్నట్టు తయారయింది. ఏవో పూల బెడ్స్ ప్రక్కనో, బోన్సాయ్ చెట్ల ప్రక్కనో ఫోటోలంటే సరే. కానీ మా ఫోటోల వైవిధ్యానికి అంతులేదు. ఓ స్టాల్లో పూలమొక్కలకి ఎరువులమ్ముతున్న అమ్మాయితో (ఆ అమ్మాయి చాలా అందంగా వుంది; ఒక ఎరువుల పాకెట్ కొంటే తనతో ఫోటో తీసుకోవచ్చంది), ఎగ్జిబిషన్ బయట ఆపివున్న కార్ల ప్రక్కన్నుంచునీ, రోడ్డు మధ్యలో, పొలం గట్ల మీద, చెట్ల క్రింద, చెట్ల మీద, ముగ్గుర్లో ఎవడో తెచ్చిన నల్ల కళ్ళజోడు ఫొటోకి ఒకరొకరం మార్చుకుంటూ, ఒక ఫొటోకి ఇన్‌షర్టూ, ఒక ఫొటోకి పక్కోడి టీషర్టూ... యిలా ఆ ఒక్కరోజులోనే మనిషి జీవపరిణామ దశల్నెంటినో పెద్ద పెద్ద అంగల్తో వెనక్కి దాటేసి విచ్చలవిడిగా ఫొటోలకు ఫోజులిచ్చాం. జీవితంలో అంతకుముందెప్పుడూ మాలో ఎవ్వరమూ అన్ని ఫొటోలు దిగలేదు. బాగా రాత్రి దాకా ఎగ్జిబిషన్ దగ్గరే కాలక్షేపం చేసింతర్వాత, హైవే మీద ఏదో కంకర మోసుకెళ్తూన్న లారీని ఆపి వెనక కంకరలోడు మీద ఎక్కాం. పాటలు పాడుకుంటూ, కేకలూ వేసుకుంటూ వెళ్ళాం. జొన్నాడ దగ్గర దిగాం. అక్కడ వేరే బస్సెక్కాలి. నాలుగడుగులేసామో లేదో, మా కెమెరా ఆ కంకర లారీలోనే వదిలేసి దిగామని అర్థమైంది. లారీ అప్పటికే కనుచూపుమేర దాటేసి చీకట్లో కలిసిపోతోంది. వెనక పరిగెత్తాం ఖాళీ రోడ్డు మీద పొలోమని, ఈసారి కంగారుతో కేకలు వేస్తూ. కానీ అది ఆగలేదు. అబిద్ గాడి కంగారు... వాడి ఫ్యామిలీ మొత్తానికి అది ఒక్కగానొక్క కెమెరా! లారీ వెళ్ళిన వైపే వెళ్ళాలని నిశ్చయించాం. వెనక వస్తున్న యింకో లారీ ఆపి ఎక్కితే వాడు చెప్పాడు, బహుశా ముందెళ్ళిన లారీ గోదావరి అవతల వున్న ‘ఎల్ & టి’ వాడి సైటు లోకి కంకర తీసుకెళ్తోందేమోనని. (అప్పుడు రావులపాలెం గోదావరి వంతెనకి ఏవో మరమ్మతులు జరుగుతున్నాయి.) అయితే అక్కడే దిగుతామన్నాం. అబిద్ గాడికి కెమెరా పట్ల ఎంత ఆందోళన వుందో, మిగతా ముగ్గురికీ అందులో ఫోటోల పట్ల అంతే ఆందోళనగా వుంది. అయినా విధి మా పట్ల అంత కఠోరంగా వ్యవహరించగలదని యింకా నమ్మలేక, పైకి జోకులు వేసుకుంటూనే వున్నాం. బ్రిడ్జి అవతల దిగి, కన్‌స్ట్రక్షన్ సైటులోకి వెళ్ళాం. లోపల బోలెడన్ని లారీలు, క్రేన్లు, క్రషింగ్ మెషీన్లు, బస్తాలు, ఇసుక, కంకర గుట్టలు... మొత్తం వాతావరణమంతా మనుషుల్లో పిపీలికత్వపు స్పృహ కలిగించి న్యూనత రేకెత్తించేలా వుంది. అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. అయినా లోపల నిర్విరామంగా పని జరుగుతూనే వుంది. ఎవరో మేనేజరనుకుంటా, సంగతి చెప్తే గత కాసేపట్లో లోపలికి ఏయే లారీలు వచ్చాయో రిజిస్టరులో చూశాడు. సెక్యూరిటీ వాణ్ణొకణ్ణి మాకు అప్పజెప్పి ఆ లారీలు వదిలిన కంకర గుట్టల్లోకి పంపించాడు. అతను మా కెమెరా ఎత్తుకెళ్ళిన లారీ తాలూకు కంకర గుట్ట ఏదైవుండచ్చో అది మాకు చూపించాడు. మేం కాసేపు ఆ గుట్ట అటూ యిటూ కెలికి చూసాం. అది చాలా పెద్దది వుంది. అంతా పెకలించినా దొరక్కపోతే! చివరికి అప్పటికే ఆశ చచ్చిపోయింది. విధి మాకు హేండిచ్చిందని కన్ఫర్మయిపోయింది. ముగ్గురం ఓ గంట అక్కడే గడిపి కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం. లారీ నుంచి లారీకి మారుతూ మాచవరం వెళ్ళి ఆ రాత్రి రెడ్డి గాడి యింట్లో పడుకున్నాం. ఇప్పటికీ మేం నలుగురం కలిస్తే అడపాదడపా ఆ రాత్రి గురించి ఓ మాట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.
మా కాలేజీ జీవితంలో కొన్ని ఆనంద క్షణాల్ని ఫ్రీజ్ చేసి ఇముడ్చుకున్న ఆ కెమెరా ఫిల్ము వాటిని ఫోటోల రూపంలో విడుదలచేసి వుంటే అవి ఎప్పటికీ మాతో వుండిపోయేవి. ఆ కెమెరాలో ఇమిడిన మా అప్పటి అవతారాలు నాకు యిప్పటికీ లీలగా స్ఫురిస్తాయి. కానీ ఆ రాత్రి ఆ కన్‌స్ట్రక్షన్ సైటులో గడిపిన క్షణాలు నాకు అంతకు మించిన స్పష్టతతో గుర్తున్నాయి. ఫోటోలుగా మారకుండానే తప్పిపోయిన ఆ ఫిల్ము మా కొన్ని జ్ఞాపకాల్ని మాక్కాకుండా చేసినా, అలా తప్పిపోవడం ద్వారా అంతకన్నా మరింత తీక్షణమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఆ అర్ధ రాత్రి హైవే రోడ్డూ, లారీలూ, తెలియని స్థలాలూ, తెలియని మనుషులూ... ఒక్కసారిగా ప్రపంచం బట్టలు తిరగేసి తొడుక్కుని వుండగా నా కంటబడినట్టు అనిపించింది. ఆ లారీ డ్రైవర్ల రోజెలా గడుస్తుందో, ఆ సెక్యూరిటీ వాడి యింట్లో కథేమిటో, ఆ కన్‌స్ట్రక్షన్ సైటులో ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయో, వాటికి మూలమైన పెద్ద పెద్ద నిర్ణయాలు నగరాల్లో ఏ కాన్స్ఫరెన్సు హాళ్ళనించి వస్తాయో, అక్కడ డెస్కుల వెనుక యింజనీర్ల కథలేమిటో...! అదివరకూ నేను పెద్దగా ఎన్నడూ గమనించని ఒక విషయం ఆ రాత్రి తెలిసింది: ప్రపంచం ఎపుడూ నిదరపోదనీ; ఏదో ఒకటి చేస్తూనేవుంటుందనీ; నాకు ఆనుపానులు తెలియని స్థలాల్లోనూ, నేను పేర్లెన్నడూ వినని ఊళ్ళలోనూ, నగరాల్లోనూ, నగరాల బయట కొండల్లోనూ, కొండల మధ్య అడవుల్లోనూ, అడవుల నిశ్శబ్దంలోనూ... నిత్యం నా చుట్టూ వున్నంత సంపన్నంగానే జీవితం నడుస్తూ వుంటుందనీ; ఎప్పుడూ ఏవో కథలు జరుగుతూనే వుంటాయనీ; కానీ అవన్నీ నాకెప్పటికీ చేరకుండానే, ఆ అగణిత క్షణాలూ, ఎన్నో అద్భుత సమయాలూ ఏ ఫొటో ఫిల్ముపైనా ముద్రితం కాకుండానే, ఈ అనంత నిర్విరామ కాలగతిలో తమ ఆచూకీ కోల్పోతూ వుంటాయనీ... ఇదంతా ఆ రాత్రి గుర్తుండిపోయేట్టు నాకు తొలిసారి తెలియజెప్పింది. ఆ రాత్రిలో ఏ దినుసులు దాన్ని అంత గాఢంగా నా జ్ఞాపకంలో ముద్రితమయ్యేలా చేసాయో నేను స్పష్టంగా చెప్పలేను. నా కూపస్థమండూక అస్తిత్వాన్నించి నన్ను కాసేపు బయటకు లాగి, వేరే ఎంతో విశాల ప్రపంచపు స్పృహను గట్టిగా నాలో కల్పించిన సంఘటనల్లో యిది కీలకమని మాత్రం చెప్పగలను. దానికి ఋజువు ఇదే, యిపుడిలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకోగానే వేరే అన్ని జ్ఞాపకాల్నీ తోసుకుని యిలా ముందుకు తోసుకొచ్చేయటమే!
రెక్కల్లేని లోటు తొలిగా తెలిసొచ్చిన కాలం
డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా వున్న కొన్ని రోజుల్లోనూ నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి యిక్కడ చెప్పాలి. ఎందుకంటే నాలో యిప్పటి భ్రమణకాంక్షకు పాదులు వేసిన పుస్తకాలు వాటిల్లో కొన్ని వున్నాయి. ముఖ్యమైనది ఒక రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం. నేను చదివిన తెలుగు అనువాదం పేరు ‘లోకసంచారి’. (అనువాదకులు ఎవరో గుర్తులేదు.) దాని మూలం పేరు ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అని గుర్తుంది. అనువాదానికి పెట్టిన పేరు కన్నా మూలం పేరు ఈ పుస్తక తత్త్వాన్ని యింకా ఖచ్చితంగా చెపుతుంది. పుస్తకంలో ఎక్కువ శాతం రాహుల్ సాంకృత్యాయన్ చేసిన ‘లోక సంచారం’ గురించి కన్నా, అసలు లోక సంచారులు ఎలా మసలుకోవాలి, మానసికంగా ఎలా సంసిద్ధులు కావాలీ మొదలైన వాటి గురించి వుంటాయి. ఈ సమయంలోనే చదివిన మరో పుస్తకం సంజీవ దేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’. సంజీవ దేవ్ కూడా రాహుల్ సాంకృత్యాయన్ లాగే చిన్నపుడే యిల్లు విడిచి దేశాటనకు వెళ్ళినవాడు. స్వయానా రాహుల్ సాంకృత్యాయన్‌తో వ్యక్తిగత పరిచయం వున్న వాడు కూడా. ఆయన చాలా చిన్నతనంలో యిల్లు వదిలి హిమాలయాలకు పోవడం, గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఏర్పరుచుకోవడం యివన్నీ చదివిం తర్వాత నాకు న్యూనత కలిగింది. నేను మసులుకున్న లోకపు విస్తీర్ణం పుట్టగొడుగు క్రింద నీడంత మాత్రమేనని అర్థమైంది. బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ కూడా యిపుడే చదివాను. అదేమీ లోక సంచారం గురించి కాదుగానీ, అందులో ఓ చోట బుచ్చిబాబు రైళ్ళలో తనకు కనిపించే ఆకర్షణని ప్రస్తావిస్తాడు. అతని యిష్టాన్ని నా యిష్టంతో పోల్చి చూసుకోవడం గుర్తుంది. ఈ పుస్తకాలన్నింటిలో నేనేం చదివానన్నది ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. (‘తెగిన జ్ఞాపకాలు’ అయితే పేరు కూడా గుర్తు లేదు. ఇది ఈమధ్యే మళ్ళీ పుస్తక రూపేణా విడుదలైనపుడు కొని రెండు మూడు పేజీలు చదివాకా, ఒహో యిది వరకూ చదివిందే కదా అనుకున్నాను.) కానీ చదివినపుడు మాత్రం వీటి ప్రభావం నా మీద వుందని గుర్తుంది.
అప్పట్లో కడియంలో వుండే వాళ్ళం. పగలల్లా పుస్తకాలు చదవడం, సాయంత్రం ఊరి చివర వుండే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూర్చోవడం. సౌందర్యంలో ఆ రైల్వే స్టేషన్‌తో పోటీ పడే మరో స్టేషన్ నాకింత దాకా తారసపడలేదు. స్టేషన్‌కి కుడి ఎడమల్లో కొన్ని గుడిసెలు. రెండు మూడు చెక్క బల్లల్తో ప్లాట్ ఫాం, దాని ముందు పట్టాలు, తర్వాత వరుసగా క్షితిజ రేఖ అవధిగా విస్తరించిన పొలాలు, ఒక ప్రక్కన కొండలు, మరో ప్రక్కన దూరంగా జి.వి.కె. ఫ్యాక్టరీ. రైలు వస్తుంటే ఆ కొండల్లో దూరంగా ముందే కన్పించేది. అక్కడ పట్టాలు అక్కడ పెద్ద యూటర్న్ తిరిగివుంటాయి. కడియంలో పట్టాలకున్నంత వంపుతో యూటర్న్ దేశంలో యింకెక్కడా లేదని, రైలు డ్రైవరూ గార్డూ ఎదురుబొదురు నిల్చొని చేతులూపుకోవచ్చనీ అమ్మ చెప్పేది. (కొంత అతిశయోక్తి కావొచ్చు.) సాయంత్రాలు అక్కడకు సైకిల్ మీద పోయి కూర్చునేవాణ్ణి. పుస్తకాలు తీసికెళ్ళే వాణ్ణి గానీ చదవబుద్దేసేది కాదు. ఆలోచించబుద్దేసేది. దేశంలో ఎక్కణ్ణించో మొదలై మరి యే మూలకో పోయే గూడ్సు రైళ్ళు అక్కడ గంటలు గంటలు ఆగేవి. చాలాసార్లు యెక్కేసి అదెక్కడికెళ్తే అక్కడికి అలా అలా పోదామా అనిపించేది. ఒకసారి టికెట్టు లేదని దింపేస్తే అక్కడ దిగిన గెడ్డం సాధువొకడు కనపడ్డాడు. అతని పట్ల కుతూహలంతో స్థానికుడొకతను ప్రశ్నలు వేస్తున్నాడు. వినేవాడు దొరికాడన్నట్టు తన జీవన శైలిని ఉత్సాహంగా చెప్తున్నాడు. నేనూ ఆసక్తిగా ఓ చెవి అటు పడేసాను. మామూలుగా యిలా కాషాయం వాళ్ళని రైలు దింపరట. ఇలా ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణిస్తుంటాడు. ఏ చోటు నచ్చకపోయినా వెంటనే బిచాణా బదిలీ. కలకత్తాలో మంచి గంజాయి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. మాటల్లో తెలిసే పోతుంది. అతనికి కాషాయం జరుగుబాటు కోసం మాత్రమే. ఆధ్యాత్మికం మాటటుంచి, ఆదమరపుగా వుంటే జేబు కొట్టేవాడిలా వున్నాడు. కానీ అతని కళ్ళు ఎన్నెన్ని ప్రదేశాలు చూసి వుంటాయోనని నాకు కుళ్ళొచ్చింది. కడియానికి ఓ ప్రక్కగా ఎర్రమట్టితో కొండగుట్టలుండేవి. అపుడపుడూ అక్కడకు సైకిల్ మీద పోయి, క్రిందనుండి చిన్నగా వెళ్తూ కన్పించే రైలుని చూడడం కూడా బాగుండేది. బహుశా ఆ పుస్తకాలూ, ఆ పరిసరాలూ, నాలో యిప్పటి తిరగాలన్న కోరికకు తొలి ప్రేరణలేమో. అయితే, ఒక పిట్ట పోయి పోయి పంజరం ఊచలకి గూడు కట్టినట్టు, నేను తర్వాత హైదరాబాదు వచ్చేసాను.
హైదరాబాదాయణం
నేను వచ్చి పదేళ్ళవుతోంది. ఏ నగర స్వరూపమైనా బయటివాళ్లకి అర్థమైనంతగా స్థానికులకి అర్థమవదని నాకన్పిస్తుంది. ఎందుకంటే స్థానికులు ఎడంగా నిలబడి చూడలేనంత మమేకమైవుంటారు నగరంతో. ‘హైదరాబాదీ’లమని ఉత్సాహపడే వాళ్ల కన్నా హైదరాబాదుని నేను ఎక్కువ చూసానని తెలుసు. మిథికల్ హైదరాబాదుని కాదు, ఇపుడున్న హైదరాబాదుని. దట్టంగా కొట్టిన దాని మేకప్ వెనుక దాగి వున్న ముడతల రహస్యాలన్నీ నాకు దగ్గరగా తెలుసు. నాకు దీని మీద ప్రేమా, విసుగూ రెండూ వున్నాయి. ప్రేమ కన్నా విసుగే ఎక్కువ. ఒకప్పుడు హైదరాబాదుకి నిర్వచనంగా నిలబడిన మైథాలజీ అంతా నేను చూస్తుండగానే కూల్చివేతకు గురైంది. దాంతో పాటే నా ప్రేమ కూడా. ఇపుడిది నిర్మాణంలో వున్న నగరం. వేరే ఏదో కాబోతున్న నగరం. ఒక పేద్ద కన్‍స్ట్రక్షన్ సైటు. యిక్కడ ఖరీదైనతనమూ గరీబుతనమూ తమ వ్యత్యాసాన్ని మరింత కొట్టొచ్చేట్టు పెంచుకున్నాయి. చిత్రంగా అదే సమయంలో ప్రాదేశిక దూరాన్ని మరింత తగ్గించుకుని ప్రక్కప్రక్కనే ఒకదాన్నొకటి వొరుసుకుంటూ కనపడుతున్నాయి. ఒక ప్రక్క షాపింగ్ మాల్సూ, టౌన్‌షిప్పులూ, ఆఫీస్ స్పేసెస్ యివన్నీ బ్రోచెర్లలో కన్పించే ‘tranquil’, ‘idyllic’, ‘state of the art’ లాంటి విశేషణాలకు తగ్గట్టుగా గొప్పగానే వుంటున్నాయి; మరోప్రక్క హెల్మెట్లు తగిలించుని సగం జీవితం ట్రాఫిక్లోనే గడిపే మధ్యతరగతి తలలు బోలెడు వుండనే వున్నాయి. ఆ తలల్లో పుట్టే ఆశల్ని ఆసరా చేసుకుని బోలెడంత నగరం వాటి చుట్టూ పరిభ్రమిస్తూంటుంది; యివికాక వీటన్నింటి మధ్యా, వీటన్నింటి ప్రక్కనే, చోటు దొరికిన చోటల్లా మూలమూలల్లోకీ సర్దుకుపోతున్న బీదతనమూ బోలెడువుంది. నాపరాళ్ళు చెదురుమదురుగా పేర్చిన యిరుకు గల్లీలూ, అటూయిటూ ఆస్బెస్టాస్ కప్పులూ, మంజీరా నీళ్ళ కోసం ఆడాళ్ళ పోట్లాటలూ, ఫ్లాట్‌ఫారాల చివర గుడుంబా పేకెట్ల మత్తులో తమ ఉనికి బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ శిథిలమైపోతున్న మనుషులు, భుజానికి గోనెసంచులు మోస్తూ చేతిలో పదునైన ఇనుప ఊచని చెత్తకుప్పల్లో గుచ్చి కవర్లు యేరుకుంటూ దిశ లేని కసిని kores కరెక్షన్ ఫ్లూయిడ్ల మత్తులో చల్లార్చుకునే బాల్యమూ, నిర్మాణంలోని ఎత్తైన భవనాల చుట్టూ తాత్కాలిక వాసాల్లో నిర్మాణ కూలీల దుమ్మూదూగరా జీవితమూ... యిలా లెక్కకు అందనన్ని దృశ్యాలు పేర్చవచ్చు; యివన్నీగాక మిగిలిన మూలలేమన్నా వుంటే అక్కడ ఒకప్పటి మిథికల్ హైదరాబాదు కృశించి అవశేషంగా వుంది. బయటివాళ్ళకి దుర్భేద్యమైన పాతబస్తీ వీధుల్లోనూ, ఆదివారం కోటీలో రోడ్లవార్న పాత పుస్తకాల పేర్పులోనూ, అపుడపుడూ సాంబ్రాణీ సాయిబు వచ్చి సువాసనలు చిమ్మి వెళ్ళే ఇరుకు కెఫెల్లోనూ తప్ప యిది పెద్దగా ఎక్కడా కన్పించదు. ప్రస్తుతానికి హైదరాబాదు ఏదో మధ్య దశలో వుంది. యీ సంచలనమంతా ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియదు. కానీ సద్దుమణుగుతుంది. యిదంతా ఎపుడోకపుడు ఎకడోకక్కడ నెమ్మదిగా నిలకడ సాధించుకుంటుంది. అపుడు ఆ నిలకడలో మరో కొత్త సంస్కృతి ఆవిష్కరించబడుతుంది. దాని లక్షణాల్ని బట్టి హైదరాబాదుకు కొత్త నిర్వచనాలు ఆపాదింపబడతాయి.
ప్రేమైనా విసుగైనా ఏమైనా హైదరాబాదు యిప్పటికే నాలో భాగం. హైదరాబాదు నాకు నేర్పినవో, లేక నేను హైదరాబాదులో వుండగా నేర్చుకున్నవో, చాలా వున్నాయి. నిత్యం అనిశ్చితి అగాధంపైన దారం పాటి ఆధారాలకి వేలాడుతూ కూడా నిశ్చింతగా వుండటం నేర్పింది. బైటి దాడులనుండి రక్షణలేని నా మునుపటి మెతకదనంపై పెళుసుదే అయినా కాస్త దురుసైన కవచాన్ని తొడిగింది. నాకు కావాల్సినన్ని పుస్తకాలిచ్చింది. నాక్కావల్సినంత సంస్కృతిని చుట్టూ అందుబాటులోకి తెచ్చింది. కానీ నేనే స్వేచ్ఛాభిలాషతో యిక్కడ అడుగుపెట్టానో అది యిక్కడా దొరకలేదు. నాకు మొదట్లో కొత్త బంగారు లోకం అనిపించిందంతా పైమెరుగని తేలిపోయింది. కానీ అసలంటూ నిలబడ్డానికి నిలకడైన ఆధారాన్ని సంపాయించేసరికే యేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో తోడుకోసం అనువుగాని తావుల్లో వెతుక్కునే నా వైకల్యమొకటి సగం కాలాన్ని తెలియకుండా దాటవేయించింది. అలా పదేళ్ళు ఆదమరుపుగానే గడిచిపోయాయి. ఈలోగా ఈ నగరపు ఇరుకు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకుండా, నా పుస్తకాలు తాము పొదువుకున్న కథల్లోని కల్పిత లోకాల షరతుల్లేని పౌరసత్వాన్ని అందిస్తూ నన్నాదుకున్నాయి.
బుద్ధిలో కొత్త పురుగు డ్రిల్లింగ్ ప్రారంభించడం
గత ఏడాది నావైపుగా నేను ఎదురుచూడని గాలులు వీచాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పుల వల్ల తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కలిగింది. అవి కూడా గమ్యమున్న ప్రయాణాలు కాదు. ఊరకే ఊళ్ళు పట్టి తిరగాల్సి వచ్చింది. ఎన్నడూ చూడని ఊళ్ళూ, చవక లాడ్జీలు, అపరిచిత చౌరస్తాలు, యిరుప్రక్కలా నిద్రగన్నేరు చెట్లు తలపైన చూరు కట్టిన రోడ్లూ, తంగేడు పూల కొమ్మల వెనక సూర్యాస్తమయాలూ, కొండల చిటారున గుడి గోపురాలూ, నదులూ, వంతెనలూ, పొలాలూ, ఎవర్నో గుర్తు తెస్తూనే వారితో ఏ పోలికలోనూ సామ్యం దొరకని కొత్త మొహాలూ... ఏదో కొత్త తరహా జీవితపు చేలాంచలం ఊరించడం మొదలుపెట్టింది. ప్రతీ చోటా ఒకేసారి వుండాలనిపించడం మొదలైంది. ప్రతీ ఊళ్ళోనూ వుండి దానికే ప్రత్యేకమైన ఆత్మని పరిచయం చేసుకోవాలి. ఆ ఊర్లో మనుషులందరి మనసుల్లోనూ ఆ ఊరి కూడలికీ, ఊర్లో స్కూలు మైదానానికీ, ఊరి మధ్య రథం వీధికీ, ఊరి చివర కొండకీ అన్నింటికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది, అది నాకు అర్థం కావాలి. నా సొంత ఊరిని ఎలా జ్ఞాపకాల రంగుల్లో వడగట్టి చూస్తానో, అలా ఆ ఊరి వాళ్ళ చైతన్యంతో ఆ పరిసరాల్ని చూడగలగాలి, ప్రేమించగలగాలి. ప్రతీ పరిసరమూ — రైల్వే స్టేషనూ, కాఫీ హోటలూ, లాడ్జీ గది, గుడి మంటపం, ఇళ్ల వరస, చెట్టు కొమ్మల అమరికా — తమ అమరిక ద్వారా ఏదో ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి, ఏవో కథలు చెప్తాయీ, లేదా ఏవో ఊహాజనితమైన కథలకు సామరస్యంగా ఆతిథ్యాన్నిస్తాయి; వాటన్నిటి సందిటా నేను గడపాలి. ఇడ్లీచట్నీలూ, ఉప్మాపెసరట్లూ, మషాలాదోసెలూ వాటిని చేసే హస్తవాసిని బట్టి చిన్న చిన్న తేడాలతో ఎన్ని రుచులు మారగలవో అన్నీ నా నాలిక మీద పడాలి. తెలియని వాళ్ళతో మాట కలపాలి. తెలియని పక్షుల్ని పేరేంటని అడగాలి. రోడ్డు ప్రక్కన దుమ్ములో సీతాకోక చిలుకల అనాథ కళేబరాల్ని చేతుల్లోకి తీసుకుని వాటి చిరిగిన రెక్కల మీద దేవుడు అదృశ్యలిపిలో రాసిన సత్యాల్ని చదువుకోవాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే, నా జీవితాన్ని నా చేతిలో వడిసెల లాగా చేసి, గిరగిరా త్రిప్పి ప్రపంచం మీదకు విసిరేసుకోవాలి. — అని అనిపించడం మొదలుపెట్టింది.
అయితే నేనే కాదు, అలా అనిపించీ ఆ అనిపించడాన్ని అనుసరించిన వాళ్ళు నా చుట్టూ వున్నారు. వాళ్ళ ప్రేరేపణ కూడా తోడైంది. ముఖ్యంగా కాశీభట్ల వేణుగోపాల్. ఆయన కూడా దేశం మీద పడి తిరిగినవాడే. ఒకసారి సైకిల్ మీద తిరిగాడు, మరోమారు కాలినడకన మొత్తం భారతదేశం తిరిగాడు. తిరగడమంటే ఒక చోట స్వస్థలమనేది పెట్టుకుని, ఆ బిందువు నుంచి మనమెక్కడకుపోతే అక్కడిదాకా తెలియని బంధనాల్ని మనసులో నిత్యం భరిస్తూ, మళ్ళీ ఎప్పటికో వెనక్కి చేరిపోతామన్న ఎరుకతో తిరగడం కాదు. కుక్క మెళ్ళో గొలుసు ఊరంత పొడవైందైనా దాని రెండో కొస ఒక గేటుకి తగిలించి వున్నంత వరకూ దాన్ని స్వేచ్ఛ అనలేం. కాశీభట్ల సంగతి వేరు. ఆయన యిల్లన్నది మర్చిపోయాడు. వెళ్ళిన చోటల్లా, వున్నంత సేపూ వున్నదే యిల్లనుకున్నాడు. ఎక్కడ వుంటే అక్కడ ఏవో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ, కూడబెట్టిన డబ్బుతో మరో చోటకి పోతూ, మళ్ళీ దాన్నే స్వస్థలమనుకుంటూ... యిలా తిరిగాడు. ఆయన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నపుడల్లా నా అంతరంగ యవనిక మీద ఆ ఎన్నడూ చూడని ప్రదేశాల దృశ్యమాలిక తెరచుకొనేది. నా మనసు వాటిలో లీనమైపోగా వర్తమానంలో ఉనికిని మర్చిపోయేవాణ్ణి.
ఈ మధ్యనే ఆయనకి నా భ్రమణకాంక్ష గురించి వెల్లడించాను. అపుడాయన యిచ్చిన సలహా, నేను పూర్తిగా పాటించలేకపోయినా, మంత్రముగ్ధుణ్ణి చేసింది: మొదటి సూత్రం, ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణించాలి. రెండుమూడు జతల బట్టల్తో బయల్దేరి పోవాలి. ఒక నోటు పుస్తకం దగ్గరుంచుకుని తోచినవి రాసుకుంటూండాలి. డెబిట్/ క్రెడిట్ కార్డులు పట్టికెళ్ళకూడదు. రైల్వే స్టేషన్ కెళ్ళి, ఫ్లాట్‌ఫాం మీద ఏ రైలు ఆగివుంటే దానికి టికెట్టు తీసుకుని ఎక్కేయాలి. ఏ వూరు ఆకర్షిస్తే అక్కడ దిగిపోవాలి. వూళ్ళోకి పోవాలి. మనుషుల్ని కదపాలి. మాట్లాడాలి. చుట్టూ చూడాలి. ఆ స్థలం పాతబడితే లారీలెక్కి యింకో చోటికి పోవాలి. లారీ వాళ్ళు డబ్బుల్లేకపోయినా బ్రతిమాల్తే ఎక్కించేసుకుంటారట. వాళ్ళకీ దూరప్రయాణాల్లో మాట్లాడే తోడు కావాలనుంటుందట. మళ్ళీ కొత్త ప్రదేశం. పని కావాలంటే ధాభాల్లో సులువుగా దొరుకుతుందట. అక్కడ పని చేస్తూ చుట్టు ప్రక్కల ఊళ్ళు తిరిగి రావచ్చు. డబ్బు సమకూరాకా యింకో స్థలం. ఒకవేళ డబ్బు మరీ లేకపోతే అపరిచితుల్నైనా బతిమాలుకోవచ్చు. చాలామంది చీదరించుకుంటారు, enjoy the humiliation! కొంతమంది ఇస్తారు కూడా. అపుడు మళ్ళీ యింకో చోటుకి.
ఆయన యిలా మాట్లాడుతున్నంత సేపూ నేను ఊహించుకున్న దృశ్యాలు నన్ను ఆ రోజే రైల్వే స్టేషన్‌కి పోవాలనిపించేంతగా ఊపేశాయి. ఎపుడో అలాగే వెళ్తాను కూడా. అయితే ఉద్యోగాన్ని వదిలేయగలిగే పరిస్థితులు యిప్పట్లో లేవు గనుక, ఫ్లాట్‌ఫామ్ మీద వున్న రైలు ఏదైనా ఎక్కేసి వెళిపోగలను గానీ, వెంట డెబిట్‌కార్డు లేకుండా వెళ్ళడమంటే సాధ్యం కాదు. పెట్టిన సెలవు పూర్తయ్యేసరికి ఠంచనుగా వెనక్కి వచ్చేయాలిగా. ఇలా తిరిగే ప్రదేశాల్లో టూరిస్టుల రద్దీ ఉండే ప్రదేశాలకు చోటు లేదు. నలువైపులా ప్రకృతి కమ్ముకుని వున్న ప్రదేశాల పట్ల కూడా పెద్ద మక్కువ లేదు. నన్ను ప్రకృతి ఆకట్టుకుంటుంది గానీ, అదేపనిగా నన్ను పట్టివుంచలేదు. యిపుడు ఫ్రెంచి రచయిత ఫ్లాబె (Flaubert) మాటలు గుర్తొస్తున్నాయి. తక్కువ మోతాదులో అవి నాక్కూడా అన్వయించుకోగలను. ఫ్లాబె తన ఆల్ఫ్ పర్వతాల పర్యటన గురించి మరో ప్రముఖ రష్యన్ రచయిత తుర్గెనొవ్‌కు రాసిన ఉత్తరంలో యిలా పేర్కొంటాడు:
నేను ప్రకృతి పుత్రుణ్ణి కాను. ‘ఆమె అద్భుతాలు’ నన్ను కళలోని అద్భుతాల కన్నా తక్కువ స్పదింపజేస్తాయి. ఆమె నాలో ఏ ‘గొప్ప ఆలోచనల’నూ జాగృతం చేయదు సరికదా నన్ను నలిపేస్తుంది. లోపల్లోపల నాకు ఆమెతో యిలా అనబుద్దేస్తుంది: ‘ఇదంతా బానే వుంది. నేను నీ దగ్గర్నుంచి కాసేపటి క్రితమే వచ్చాను, మరికొన్ని క్షణాల్లో మళ్ళీ అక్కడికే చేరుకుంటాను. కాబట్టి నన్ను నామానాన వదిలేయ్. నాకు వేరే సరదాలు కావాలి’.
పైగా ఈ ఆల్ఫ్స్ పర్వతాలు మనిషి అస్తిత్వ పరిధికి అందని కొలత కలవి. అవి ఎందుకూ ఉపయోగపడనంత పెద్దవి. నాలో అవి ఇలాంటి అసంతృప్తి కలిగించడం ఇది మూడోసారి. ఇదే చివరి సారని ఆశిస్తాను.
నాకు మనుషుల్లోనూ, వాళ్ళు నిర్మించిన నాగరికతలోనూ ప్రకృతితో సమానమైన సౌందర్యం కనిపిస్తుంది. ప్రకృతంతా ఏ నూటపద్దెనిమిది పరమాణు మూలకాల్తో నిర్మితమయిందో, వాటితోనేగా మనుషులు కట్టడాలూ నిర్మితమయింది! అంతా చూసే కళ్లలోనే అనిపిస్తుంది. ప్రకృతి భారీతనం ఈ విశాలవిశ్వంలో మనిషి అస్తిత్వపు విలువేంటన్నది స్ఫురింపజేస్తుందన్నది నిజమే. కానీ చూసే కళ్ళుంటే, నగరంలో ట్రాఫిక్‌లో వున్నా, తలెత్తి చూస్తే కన్పించే నక్షత్రాలు కూడా నిత్యం మన విలువను మనకు గుర్తు చేస్తూనే వుంటాయి.
మొన్నో రోజు అప్పటికపుడు అనుకుని నేనూ చౌదరిగాడూ కలిసి బైకు మీద శ్రీశైలం వెళిపోయాం. యిది నేను తిరగాలనుకున్న పద్ధతిలో జరిగిన ప్రయాణం కాదు. ఒంటరిగా, బస్సుల్లోనూ రైళ్ళలోనూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, తోచిన ఆలోచనలు రాసుకుంటూ... యిలా సాగుతుంది నేననుకున్న పద్ధతి. కాబట్టి లెక్క ప్రకారం దీన్ని నా తిరిగాలన్న ప్లానులో భాగం చేయకూడదు. కానీ ప్రయాణం ఎంత ఆనందంగా సాగిందనీ! తెల్లారి నాలుగింటికి లేచి తాపీగా బయల్దేరాం. తోచిన చోటల్లా ఆగుతూ పోయాం. పైగా అదేంటో, శ్రీశైలం దాకా రోడ్డంతా మాదే అన్నట్టు అస్సలు జనసమ్మర్ధం లేదు. పదైంది చేరేసరికి. రాత్రి తిరుగుప్రయాణాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీశైలం నుండి హైదరాబాదు మొత్తం నూటతొంభై కిలోమీటర్ల దూరమయితే, అందులో ఘాట్ రోడ్డే తొంభై కిలోమీటర్లుంటుంది. యిదంతా నల్లమల అడవుల మధ్యగా సాగుతుంది. ఘాట్ రోడ్లో లైట్లుండవు. పైగా మేము వెళ్ళిన రోజు రద్దీ లేదని చెప్పాగా. మొత్తం అంత దూరమూ ఆ కటిక చీకట్లో, ఎడాపెడా భయపెట్టే నిశ్శబ్దంతో దట్టంగా కమ్ముకున్న అడవి మధ్య నుంచి, ముందూ వెనకా మా బైక్ యిచ్చే గుడ్డి వెలుగు తప్ప ఏదీ ఆనని రోడ్డు మీద ఆ రాత్రి మా ప్రయాణం అపూర్వానుభవం. మధ్యలో రెండు మూడు సార్లు బైక్ ఆపేసాం. దాని లైటు కూడా ఆర్పేసాం. ఆ చీకట్లో ఆకాశమంతా దట్టంగా అలుమున్న నక్షత్ర సమూహాన్ని చూస్తూ చాలాసేపు గడిపాం. అంత స్పష్టంగా అన్ని నక్షత్రాల్ని నేనదివరకూ అరుదుగా చూసాను. నల్లమల అడవిలో మొత్తం నూటయిరవై దాకా పులులూ, రెండొందల చిరుతలూ వున్నాయట. ఒకటైనా అటువైపు వచ్చి కన్పించేపోతే బాగుండుననుకున్నాం. కానీ రాలేదు.
July 27, 2009
ఇవాళ...

ఇక్కడ ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన అద్భుతమైన సంపదంతా మనకి అనుమతిలేని ఓ రెండస్తుల చీకటి కొట్టంలో వుంటుంది. అయితే, అడిగితే ఎలాగూ అనుమతి లేదంటారు కనుక, మనం అదను చూసి అక్రమంగా చొరబడిపోవచ్చు. ఈ పుస్తకాలు మన లాంటి వాళ్ళకి సంపదా గింపదా గానీ అక్కడెవడికి పట్టిందీ! కాబట్టి లోపల ఎంతసేపున్నా ఎవడూ వచ్చి చెక్ చేయడు. కానీ లోపల గబ్బిలాలు మాత్రమే అలవాటు పడగలిగే చీకటి వుంటుంది. ఇంకో సానుకూలత ఏంటంటే, మల్టీప్లెక్సుల్లో "స్కేరీ హౌసు"ల్లోలా ఇక్కడ డబ్బు పెట్టి భయం కొనుక్కోవాల్సిన పని లేదు; ఆ చీకటికీ, నీరవ నిశ్శబ్దానికీ ఉచితంగా భయం కలుగుతుంది. అందువల్ల, ఆ పుస్తక సంపద చూసి నోరెళ్ళబెట్టడమే తప్ప స్థిమితంగా చదువుకొనే వీలేమీ అక్కడ వుండదన్నమాట. కానీ అంత మంచి పుస్తకాలు చేతుల్లోకి తీస్కొని పేజీలు తిప్పడమూ ఓ అనుభవమే కదా. అందుకే ఓ రోజు లోపల చేరి మొత్తం రాక్‌లన్నీ తిరగదోడేసాను. ఆ పెళుసు పేజీలూ, ఆ సల్ఫర్ కంపూ, చేతుల మీదకి పాకేసే సిల్వర్‌ఫిష్‌లూ . . . దుమ్మంటే పడనివాడైతే చచ్చూరుకునేవాడు. పైగా అది ముసురు పట్టిన రోజు కావటంతో ప్రతీ పుస్తకం కిటికీ దగ్గర మసక వెలుతుర్లోకి తీసుకెళ్ళి చూడాల్సొచ్చేది. అయితేనేం, అప్పటి వరకూ ఊహల్లోనే తడిమిన కొన్ని పుస్తకాల్ని చేతుల్తో ముట్టుకున్నానన్న తృప్తి దక్కింది. ఆ తర్వాత చాలామార్లు పగటి కలలు కనేవాణ్ణి. వాటి ఇతివృత్తం అయితే దోపిడీ అయ్యేది లేకపోతే దొంగతనమయ్యేది. దోపిడీ అనుకుంటే, "కసీనో రాయల్"లో డానియెల్ క్రైగ్‌లాగా పెద్ద బుల్‌డోజర్‌తో లైబ్రరీ గోడల్ని పగలగొట్టుకుంటూ ఎంట్రీ ఇవ్వడం, నాకు అడ్డొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులందర్నీ "టెర్మినేటర్-టూ"లో ఆర్నాల్డ్‌లాగా మెషీన్ గన్‌తో కాల్చిపారేయటం, నాకు అడ్డురాలేక భయపడి మూలనక్కి వున్న ఉద్యోగులందర్నీ బయటకీడ్చి వాళ్ల చేత పుస్తకాలన్నీ మోపించి, బయట పార్క్ చేసిన పెద్ద కంటెయినర్ ట్రక్కులో పేర్పించటం... ఇదీ సినేరియో. ఇలా కాక దొంగతనం అనుకుంటే, ఓ చీకటి అర్థరాత్రి బిగుతైన నల్లఫాంటూ నల్ల చొక్కా వేసుకుని, కళ్ళకి జోరో మాస్కు తొడుక్కుని, అందినన్ని పుస్తకాల్ని వీపునున్న "పుష్పక మూట"లో కుక్కేసి, అంతకుముందే గుండ్రంగా కళాత్మకంగా బద్దలుగొట్టిన గోడ కన్నంలోంచి పారిపోవడం... ఇలా అన్నమాట. ఒకవేళ ఈ రెంటిలో ఏదన్నా నేను నిజంగానే చేసున్నా, జీవితాంతం ఇసుమంత పశ్చాత్తాపం లేకుండా—పశ్చాత్తాపం మాటటుంచి, ఆ పుస్తకాలకో సార్థకత కల్పించానన్న సంతృప్తితో—బతికగలిగే వాణ్ణి. కానీ ఏంచేస్తాం! నా అన్ని పగటి కలల్లాగే వీటి పునాదులూ గాల్లో వున్నాయిగా.
ఇక, అందరికీ అనుమతి దొరికే మిగతా విభాగాల్లో వున్న ఆంగ్ల సాహిత్యం మటుకు చాలా వరకూ చచ్చు సరుకై వుంటుంది. కొన్నైతే వ్యక్తిగత గ్రంథాలయాల్లోంచీ చోటు చాలక తన్ని తరిమేస్తే ఇక్కడకొచ్చి చేరినవిలా అనిపిస్తాయి. మహా అయితే రెండు అల్మరాలుంటాయంతే. నేను ఈ విభాగంలోనే ఎక్కువ కూర్చునేవాణ్ణి. ఇక్కడ చాలా చదివాను. ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినవి చెప్తాను: పేర్లు గుర్తు లేదు గానీ; ఎక్కువ కాఫ్కా, దాస్తొయెవ్‌స్కీ రచనల మీద విశ్లేషణలు చదివాను. అప్పటికి కొన్నాళ్ళ క్రితమే "సన్స్ అండ్ లవర్స్" చదివున్నాను కాబట్టి డి.హెచ్. లారెన్స్ గురించి కూడా చదివాను. పుష్కిన్ కథలు కొన్ని చదివాను. ఆంగ్ల సాహిత్యాన్ని గురించిన విజ్ఞానసర్వస్వాలు కూడా ఎక్కువ తిరగేసేవాణ్ణి. కొంతమంది జీవిత చరిత్రలు చదివాను (అయాన్‌రాండ్ మీద బురదజల్లుతూ ఎవరో ఆవిడ కుత్సితంగా రాసిన జీవిత చరిత్రొకటి గుర్తొస్తోంది). హెమింగ్వే, ఫిట్జ్‌గెరాల్డ్‌ల స్నేహం గురించి ఏదో పుస్తకం చదివాను. అస్తిత్వవాదం గురించి అక్కర్లేని చెత్త చాలా చదివాను. ఎందుకో నాటకాలు ఎక్కువ చదివాను. టెనెస్ విలియమ్స్ నాటకం "ద గ్లాస్ మెనేజరీ", శామ్యూల్ బెకెట్ నాటకం "క్రెప్స్ లాస్ట్ టేప్" (పూర్తిగా అర్థమయిందని చెప్పలేను), హెరాల్డ్ పింటర్ నాటకం "డంబ్ వెయిటర్" బాగా గుర్తున్నాయి. చెకోవ్ నాటకం "ద త్రీ సిస్టర్స్" సగమే చదవగలిగాను.
ఇక్కడ చదవడానికి చాలా ఏకాగ్రత కుదిరేది. రోడ్డు పక్కనే వున్నా, కిటికీలు తెరిచే వున్నా ట్రాఫిక్ హోరు ఏమాత్రం ఇబ్బంది పెట్టేది కాదు. గది నిలువునా ఓ పొడవాటి బల్ల నిజాం డైనింగ్ టేబులంత పెద్దగా వుండేది. దాని చుట్టూ కుర్చీల్లో కూర్చుని చదువరులు కాలం మరిచిపోయి అక్షరాలు భోంచేస్తుండేవారు. కొంతమందైతే కడుపు నిండిన మగతతో పుస్తకాలు బోర్లించి హాయిగా నిద్రపోయేవాళ్ళు కూడా. నేను మాత్రం, మెదడు మొద్దుబారినప్పుడు దిక్కులు చూడ్డానికి కాస్త విరామం తీసుకుంటూ, ఏదోకటి తిరగేస్తూనే వుండేవాణ్ణి. ఎందుకో అప్పట్లో నాకు ప్రతీ పుస్తకమూ చదివింది చదివినట్లు ఏ విశ్లేషణలూ తొక్కాతోలూ లేకుండా మనసుకు పట్టేసేది; నమ్మకంతో చదివేవాణ్ణి. ఆ శక్తి ఈ మధ్యన మెల్లమెల్లగా హరించుకుపోతూందనిపిస్తూంది. దరిమిలా నేను బ్లాగడం మొదలుపెట్టడం కూడా దీనికి కొంత కారణం అనిపిస్తుంది.
ఇవాళ వెళ్ళటం వెళ్ళటం ఈ విభాగంలోకే వెళ్ళాను. చోటు కాస్త మారింది. పాత పొడుగాటి బల్ల తీసేసి ఆ నిడివిలో నాలుగో అయిదో విడి బల్లలు వేసారు. నిజాని కివాళ చదవటానికన్నా పాత స్నేహితుణ్ణి ఓసారి పలకరిద్దామన్నట్టు వచ్చానంతే ఇక్కడికి. అయితే మనసూరుకోదుగా. చేయి పుస్తకాల్ని తడుముతూ పోయింది. వెన్ను మీద పేరు లేని పుస్తకాల్ని బయటకి లాగి తెరిచి పేర్లు చూసుకుంటూ పోయాను. నాకిలా చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా పుస్తకాల కొట్టుకెళ్ళినా కూడా, నాక్కావాల్సిన పుస్తకం దొరికేసినా సరే, అక్కడున్న అరలన్నింటినీ ఓసారి గత్తరబిత్తర చేసిగానీ బయటకిరాను. (ఇంతేగాక పుస్తకాల షాపుల్లో నేను చేసే కంత్రీ పని మరొకటుంది. ఆ నెలకి కేటాయించిన నిధుల పరిధి మించిపోయినాక కూడా ఇంకా ఏవైనా పుస్తకాల మీద మనసు లాగిందనుకోండి, మళ్ళీ నెల వచ్చికొనేదాకా అవి ఎవరి కంటా పడకుండా మూల అరల్లోనో వెనక వరుసల్లోనో దాచేస్తాను.) ఎలాగూ వచ్చాం కాబట్టి కాసేపేదైనా చదువుదాం అనిపించడంతో, మరో పక్క ఆలస్యం కూడా అయిపోతుండటంతో, అరల్లో చేతుల అల్లరి ఆపి అప్పటికప్పుడు దొరికిన ఎరిక్ సీగల్ "ఓన్లీ లవ్" నవలని చేతిలోకి తీసుకున్నాను. వెనుక అట్ట మీద క్లుప్తంగా కథ రాసుంది. ఒక అమ్మాయి అబ్బాయీ ప్రేమించుకుంటారు. తర్వాత దూరమైపోతారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ అబ్బాయికి ఆమె అంటే మమకారం (అచ్చ తెలుగులో చెప్పాలంటే "బెమ") పోదు. అతనిప్పుడు ఓ వైద్యునిగా పనిచేస్తుంటాడు. కొన్నేళ్ళు గడచిన తర్వాత పాత ప్రేయసి భర్త అతన్ని కలుస్తాడు. తన భార్యకు ప్రాణాంతకమైన వ్యాధి వుందనీ, నయం చేయమనీ కోరతాడు. ఆమె మళ్ళీ ఇతని జీవితంలోకి వస్తుంది. మామూలుగా వెనక అట్టల మీది ఇలాంటి సంక్షిప్త కథల్లో వుండే సుత్తి ఉత్కంటనే కలిగిస్తూ ఇక్కడితో ఆగిపోయింది. నేను దాన్ని తీసుకుని కుర్చీలో కూలబడ్డాను. చివరి మూడు అధ్యాయాలూ చిన్నవిగా కనిపించడంతో చదివేసాను. నేను చదివిన అధ్యాయాల్లో నాకు అందిన కథేమిటంటే: ఆమె వ్యాధి ముదిరిందనీ, కొన్నాళ్ళే బతుకుతుందనీ నిర్దారణ అయిపోతుంది. ఇద్దరూ కలిసి గతంలో ప్రేమలో వున్నప్పుడు చూసిన ఓ ఒపెరాకి వెళ్తారు. గతంతో కదిలించినంతగా అది ఇప్పుడు ఇద్దర్నీ కదిలించలేకపోతుంది. తర్వాత ఆమె అతన్ని ఇంటికి భోజనానికి పిలుస్తుంది. అక్కడ తనని స్వీకరించమని అడుగుతుంది. అతను తిరస్కరిస్తాడు. ఆమె మోహాతిశయంతో అతని మీద వాలి ముద్దు పెట్టుకుంటూండగా భర్త తలుపు తీసుకు వస్తాడు. గొడవ జరుగుతుంది. ఆ ఆవేశకావేశాల్లో ఆమెకు వ్యాధి తిరగబెడుతుంది. ఇద్దరూ ఆమెని హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. అక్కడామె మరణిస్తుంది. హాస్పిటల్ కారిడార్లో భర్త ప్రేమికునితో తన భార్య ఎప్పుడూ తననే కోరుకుందని సమర్థించుకోజూస్తాడు. ఈ వాదనంతా ఇప్పుడెందుకూ అని అడిగితే, ఆమె జీవితంలోనూ నాదే మరణంలోనూ నాదే అనేదో చెప్తాడు. చివరి అంకంలో ఈ ప్రేమికుడు ఇంటికి వెళ్ళి, తన పాత ప్రేయసి పునః రంగప్రవేశం కారణంగా తనకు దూరమైపోయిన భార్యని మళ్ళీ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటాడు. కాస్త విషాదపు చేదు కలిసిన తియ్యని సుఖాంతం. నేను చదివిన కాసిని పేజీల్నీ బట్టి నవల చాలా వేగంగా చదివిస్తుందని అర్థమైంది. ఆ కాస్తా చదవటానికి పావుగంట కూడా పట్టలేదు. కాకపోతే కథే, ఏదో హాలీవుడ్ మెలోడ్రామా లాగా అనిపించింది; కథనాన్ని ముందుకు నడిపేది ప్రధానంగా సంభాషణలే (నాకు నచ్చని పద్ధతి). చదివింది చివరి కాస్తే అయినా మొత్తం పుస్తకం చదివేసినట్టనిపించింది. పుస్తకం అరలో పెట్టేయటానికెళ్తూ పేజీలు తిరగేస్తుంటే, ప్రారంభంలో నవలకు ఎఫిగ్రాఫ్‌గా ఫ్లాబర్ వాక్యం ఒకటి కనిపించింది. నచ్చింది: The better part of life is spent saying: "it's too early", and then "it's too late". అప్పటికే చీకటి పడిపోతుండటంతో, లైబ్రరీకి మళ్ళీ కలుద్దామని వీడ్కోలు చెప్పేసి, బయట పడ్డాను. కథ కంచికి, నేను నా గదికి. ఆ తర్వాత పడుకోబోయే ముందు, వేళ్ళు కాస్త దురద పుడితే, ఇదిగో వాటినిలా కీబోర్డు మీద రాపాడించానన్నమాట.
ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది: ఆ ముసురుపట్టిన రోజు చూసిన పుస్తక సంచయపు దృశ్యం నా మనసులో అలానే వుండిపోయిందని; బహుశా దాంతో పోటీ పడాలనే, చదివినా చదవకపోయినా, నా గది అల్మరాల్ని పుస్తకాల్తో నింపేస్తున్నానేమోనని.
:
April 17, 2009
మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో...
రాయడానికి అస్సలేమీ లేనపుడు, అయినా కాస్సేపు అక్షరాల సాంగత్యంలో గడపాలనిపించినపుడు, ఉత్తమమైన ఉపాయం అనువాదం. స్వతంత్ర రచనలో, మన భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోగలిగినపుడు చాలా ఆనందం కలుగుతుంది; అనువాదంలో, వేరే వాళ్ళ భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోవడంలో, అంత కాకపోయినా కొంత ఆనందం కలుగుతుంది. అలాగే మొదటి దాంతో పోలిస్తే సహజంగానే రెండో దాంట్లో అలసట, అయోమయం తక్కువ. అందీ అందక విసిగించే జింకల్లాంటి భావాల్ని పట్టుకోవడానికి మస్తిష్కారణ్యంలో పడి వాక్యాల వేటకుక్కల్ని వదలనక్కర్లేదు. మూలంలోని వాక్యాల రూపంలో చేయవలసిన పని ఫలానా అని ముందే ఓ దిశానిర్దేశం వుంటుంది.
అనువాదం అనగానే గుర్తొచ్చిన పేరా యిది. రెండ్రోజుల క్రితం చదివిన "ద పొటాటో ఎల్ఫ్" అనే కథలోనిది. రచయిత నబొకొవ్. ఇదే ఎందుకు గుర్తొచ్చింది? బహుశా నబొకొవ్ యిలాంటి పేరాలు అరుదుగా రాయడం వల్ల కావచ్చు. అరుదుగా రాయడం అంటే ఇంత అందమైన వచనం అరుదుగా రాయడమని కాదు. నబొకొవ్ వచనమంతా అందంగానే వుంటుంది. ఇందులో వున్న ప్రత్యేకత వేరు. నబొకొవ్ ఉత్తమపురుషలోనే కథనాన్ని నడిపినా, "నేను" అంటూ కథ చెప్పే పాత్రకి ఎప్పుడూ తన వ్యక్తిత్వం, తన అభిప్రాయాలు అరువివ్వడు; కథలో ఎప్పుడూ కలగజేసుకోడు. ఇక ప్రథమపురుష (third-person) కథనంలో అయితే సమస్యే లేదు; కనిపించనే కనిపించడు. నిశ్శబ్దంగా, గంభీరంగా వచనపు తెరవెనకే నక్కిపోయి వుంటాడు. "ఎందుకంత గంభీరత్వం, ఒక్కసారి కథలోకి వచ్చి ఒళ్ళు విరుచుకోవచ్చు కదా" అని ఒక్కోసారి విసుక్కోబుద్దేస్తుంది కూడా. ఈ పేరాలో అదే చేస్తున్నాడు. అందుకే అరుదైన పేరా అంటున్నాను. (అయితే ఈ ఒళ్ళు విరుచుకున్న సందర్భం కథ మొత్తం చదివినవాళ్ళకే అర్థమవుతుంది):
"Every seperate day in the year is a gift presented to only one man—the happiest one; all other people use his day, to enjoy the sunshine or berate the rain, never knowing, however, to whom that day really belongs; and its fortunate owner is pleased and amused by their ignorance. A person cannot foreknow which day exactly will fall to his lot, what trifle he will remember forever: the ripple of reflected sunlight on a wall bordering water or the revolving fall of a maple leaf; and it often happens that he recognizes his day only in retrospection, long after he has plucked, and crumpled, and chucked under his desk the calendar leaf with the forgotten figure."
"సంవత్సరంలో ప్రతీ ఒక్క రోజూ కేవలం ఒకే మనిషికి—అత్యంత ఆనందకరమైన మనిషికి—సమర్పితమైన బహుమతి; మిగతా జనమంతా అతని రోజుని, సూర్యకాంతిలో సుఖించడానికో లేక వర్షంలో విసుక్కోవడానికో, వాడుకుంటారు; ఆ రోజు నిజంగా ఎవరికి చెందిందో ఎప్పటికీ తెలుసుకోరు; అదృష్టవంతుడైన దాని యజమాని వాళ్ళ అమాయకత్వానికి ముచ్చటపడతాడు, వినోదిస్తాడు. ఏ రోజు తన ఖాతాలోకి జమ కాబోతోందో, ఏ అల్పవిషయాన్ని తాను శాశ్వతంగా గుర్తుంచుకోబోతున్నాడో ఏ వ్యక్తీ ముందే తెలుసుకోలేడు: నీటి చెలమ అంచునున్న గోడపై ప్రతిబింబించిన సూర్యకాంతి తరంగాలో లేక ఓ మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో. . . ; చాలాసార్లు అతను తన రోజేదో గుర్తించేది సింహావలోకనంలోనే; మర్చిపోయిన అంకెగల కేలండర్ కాగితాన్ని చింపి, నలిపి, మేజా కింద గిరవాటేసిన చాన్నాళ్ళ తర్వాతనే."
కథలో ముఖ్య పాత్ర సర్కస్‌లో ఒక మెజీషియన్ దగ్గర పనిచేసే మరుగుజ్జు. అంతకు ముందురోజు రాత్రే తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా తనని ప్రేమిస్తుందనే నమ్మకంతో, తెల్లారి ఆమె ఇంటి నుండి బయటపడి, ఒక కొత్త రోజులోకి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడ్తాడు. ఆమె తనను ప్రేమించడం లేదని, జాలి చూపించిందని, అంతేకాదు ఆ రాత్రే తనను విడిచి శాశ్వతంగా వెళిపోతుందని తెలిసేదాకా రోజంతా ఆనందంగానే గడుపుతాడు. (విచిత్ర సోదరుల్లో కమల్ హాసన్ గుర్తొస్తాడు.) అతని మొత్తం జీవితానికి ఆ ఒక్క రోజే ఆనందకరమైన రోజు, ఆ ఒక్క రోజే అతనికి బహుమతిగా సమర్పితమైన రోజు. కథ విషాదాంతం. నాకు నచ్చింది. కానీ చిత్రంగా నబొకొవ్‌కి నచ్చలేదట. పాతికేళ్ళ వయస్సులో రాసిన ఈ కథ గురించి నబకొవ్ తన డెబ్భైఅయిదోయేట ఇలా అన్నాడు: ". . . but all in all it is not my favorite piece, and if I include it in this collection it is only becasue the act of retranslating it properly is a precious personal victory that seldom falls to a betrayed author's lot."
ఇంతకీ నాకే బహుమతిగా ఇచ్చిన రోజులు ఏమై వుంటాయి? సింహావలోకనంలో, నబొకొవ్ అన్నట్టే, కొన్ని అనుకోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి: నున్నగా మేటేసిన లంక ఇసుకలో కాలిముద్రలు పడేలా, ఆ కాలి ముద్రలు ఓ పెద్ద పేరుగా రూపుదిద్దుకునేలా పరిగెత్తడం. పైన వంతెన మీద పోయేవాళ్ళు—సైకిళ్ళ మీంచి, స్కూటర్ల మీంచి, బస్సు కిటికీల్లోంచీ—విచిత్రంగా క్రిందకి చూడడం. ఆ రోజు ఏ తేదీనో, ఏ నెలో, ఏ సంవత్సరమో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఆ రోజు నాదని.