March 11, 2012

"మిత్రభేదం" కథకి ముందుమాట

నాలుగేళ్ల క్రితం "సరిహద్దుకిరువైపులా" రాసిన వెంటనే రాయాల్సిన కథ యిది. చివరికి యిపుడు సాధ్యమైంది. కథ పెద్దది కాబట్టి దీన్ని రోజుకో విడతగా ప్రచురిస్తున్నాను.  ప్రస్తుత అంచనా ప్రకారం పదకొండు విడతలుగా వస్తుంది. ఈ కథకీ, నా "రంగువెలిసిన రాజుగారిమేడ కథ"కీ కొంత బీరకాయపీచు సంబంధం లాంటిది వుంది.  అయినా కూడా ఇది స్వతంత్రంగా నిలబడగలదని నేననుకుంటున్నాను.  ఈ కథా రచనలో సంహిత భాగస్వామ్యం యిక్కడ మాటల్లో చెప్పలేనిది.  తాను లేకుంటే యీ కథకి అసలో అస్తిత్వమే వుండేది కాదు. కృతజ్ఞత తెలుపుకునేటంత దూరం కాదు కాబట్టి ఆ అవసరం లేదుగానీ, సందర్భోచిత మనిపించి ప్రస్తావిస్తున్నాను.  పాఠకులకు కథ చదివేటపుడు ప్రశ్నలేవన్నా వస్తే కథ మొత్తం పూర్తయ్యే దాకా ఆగమని విన్నపం. అప్పటికీ నివృత్తి  కాకపోతే అపుడు సమాధానమిస్తాను.

2 comments:

  1. కాల్పనికాలను ఇంత ప్రతిభావంతంగా మలచగలగడం అచ్చెరువొందిస్తోంది..మొదటి రెండు రోజులూ తీరిక దొరకగానే మొట్టమొదట "మిత్రభేదం" చదవాలనుకున్నదాన్నల్లా, మూడో భాగానికే పనులను వెనక్కు నెట్టి, ఇది ముందు- (ఇదే ముందు) చదువుకుంటున్నాను.

    మీరు ఎంచుకున్న ఇతివృత్తమూ, కథను కొంత కొంతగా విప్పుతూ మాలో ఆసక్తి రేకెత్తిస్తున్న విథానమూ బాగా, బాగా నచ్చాయి.

    మంచి రచనలు ఇచ్చే తృప్తి వెలకట్టలేనిది. మాటల్లో చెప్పలేనిది కూడా..కానీ ఈ కాస్త ప్రతిస్పందనా మీకందివ్వకపోతే ఏదో వెలితిగా ఉంది. అప్పుడప్పుడూ, ఇంత కొత్త శక్తిని కేవలం చదవడం ద్వారా పొందుతూ కూడా, దానికి కారణమైన మీకు ఏ కృతజ్ఞతలూ చెప్పుకోకపోవడం తప్పన్న బాధ కూడా కలిగింది :).
    పొడి పొడి అక్షరాల్లో పెట్టిన ఈ మాటల ద్వారా మాత్రం నా సంతోషాన్ని తూకమేసే తప్పిదం, స్వతహాగా రచయితలైన మీరెన్నటికీ చెయ్యరన్న నమ్మకంతో....:)

    ReplyDelete