March 23, 2012

మిత్రభేదం పూర్తి కథ pdf

"మిత్రభేదం" కథ ధారావాహికకు అనువైంది కాకపోయినా, యీ బ్లాగరు మాధ్యమ పరిమితి వల్ల భాగాలుగా విడదీసి ప్రచురించాల్సివచ్చింది. ఒకే విడతలో చదవగలిగే కథ కాదు గానీ, చదువుతున్నపుడు యెక్కడ ఆపి మళ్ళీ యెక్కడ అందుకోవాలన్న నిర్ణయం చదువరికే వదిలేయాల్సిన కథ. అందుకే కథని pdf ఫైలుగా చేసి క్రింది లింకులో వుంచుతున్నాను. "రంగు వెలిసిన రాజుగారిమేడ కథ" కూడా దీనితో సంబంధమున్నదే కనుక దాన్ని కూడా ఫైలు చివర్న జత చేసాను (93వ పేజీ నుండి).

మిత్రభేదం pdf 

అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

3 comments:

  1. బాగుందండీ. పోతన ఖతి వాడారు. కొంచెం టచ్ ఇస్తే పబ్లిషర్ పబ్లిష్ చేసిన పుస్తకం లా ఉంటుంది. ఒపెన్ ఆఫీసు వాడారా లేక వర్డా. నేనయితే ఓపెన్ ఆపీసులో చేసి పి.డి.యఫ్. లోకి మారుస్తాను. కవరు పేజీ కలరులో వెయ్యండి. దాని తరువాత పేజీ ఖాళీగా వదలండి. దాని తరువాత మళ్లీ పుస్తకం పేరు వెయ్యండి. దానివెనుక వ్రాసిన వారి పేరు మొదలయిన సమాచారం ఇవ్వండి. దాని తరవాత పేజీనుండి మేటరు మొదలు పెట్టండి.

    నేను చేసిన పుస్తకాలు కూడా స్క్రిబ్డ్ లో ఉన్నాయి - ఆర్షధర్మము దానిని చూడండి. మీకు అర్థం అవుతుంది.

    ReplyDelete
  2. సంతోషం. ఎలాగో మీరు ధారావాహిక ప్రచురించడం మిస్సయ్యాను.

    ReplyDelete
  3. వేణుగోపాల్ గారు,

    సూచనలు ధన్యవాదాలు. నేను వర్డ్‌ వాడాను. ప్రింటు చేసి చదువుకోవటానికి వుద్దేశించింది గనుక కవరు పేజీ కలర్ అవసరమనిపించలేదు. మీ ఆర్షధర్మము చూసాను. బాగుంది. మీరన్న మిగతా సూచనలు పాటిస్తాను.

    ReplyDelete